Share News

నేటి మ్యూచువల్ ఫండ్స్

ABN , Publish Date - Jan 27 , 2025 | 02:20 AM

యాక్సిస్‌ నిఫ్టీ 500 మూమెంటమ్‌ 50 ఇండెక్స్‌ ఫండ్‌, ఎల్‌ఐసీ ఎంఎఫ్‌ మల్టీ అసెట్‌ అలోకేషన్‌ ఫండ్‌...

నేటి మ్యూచువల్ ఫండ్స్

యాక్సిస్‌ నిఫ్టీ 500 మూమెంటమ్‌ 50 ఇండెక్స్‌ ఫండ్‌

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌.. నిఫ్టీ 500 మూమెంటమ్‌ 50 ఇండెక్స్‌ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఇండెక్స్‌ ఫండ్‌. ఈ ఫండ్‌కు నిఫ్టీ 500 మూమెంటమ్‌ 50 టీఆర్‌ఐ బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌గా ఉంటుంది. ఆరు నుంచి ఏడాది కాలవ్యవధిలో మంచి పనితీరు కనబరుస్తున్న స్టాక్స్‌ను ఎంపిక చేసుకుని ఈ ఫండ్‌ పెట్టుబడులు పెట్టనుంది. ఈ ఫండ్‌ కనీస పెట్టుబడి రూ.100. ముగింపు తేదీ ఫిబ్రవరి 7.

ఎల్‌ఐసీ ఎంఎఫ్‌ మల్టీ అసెట్‌ అలోకేషన్‌ ఫండ్‌

ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌.. మల్టీ అసెట్‌ అలోకేషన్‌ ఫండ్‌ ను ప్రారంభించింది. ఈక్విటీ, డెట్‌, బంగారంలో పెట్టుబడులు పెట్టే ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ పథకం. దీర్ఘకాలంలో మంచి లాభాలు ఆర్జించే విధంగా ఈ ఫండ్‌ను రూపొందించింది. ఈ ఫండ్‌ ముగింపు తేదీ ఫిబ్రవరి 7. కనీస పెట్టుబడి రూ.5,000. సిప్‌ రూపంలో నెలకు రూ.200 ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది.


Also Read: అరిటాకులో భోజనం చేయడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?

Also Read: కోట్లు ఖర్చు పెట్టి.. కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మించిన కేసీఆర్

Updated Date - Jan 27 , 2025 | 02:20 AM