Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. ఎంతంటే?
ABN , Publish Date - Oct 10 , 2025 | 01:18 PM
ఇటీవల బంగారం ధరకు రెక్కలొస్తున్నాయి. గోల్డ్ రేటు ఆకాశం వైపు దూసుకెళ్తుంది. సామాన్యులకు దొరకనంత ఎత్తుకు బంగారం ధర వెళ్తోంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంకా చెప్పాలంటే బంగారం అంటేనే మహిళలు బయపడే రోజులు వచ్చాయి. డాలర్‌తో పోల్చుకుంటే..
ఇటీవల బంగారం ధరకు రెక్కలొస్తున్నాయి. గోల్డ్ రేటు ఆకాశం వైపు దూసుకెళ్తుంది. సామాన్యులకు దొరకనంత ఎత్తుకు బంగారం ధర వెళ్తోంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంకా చెప్పాలంటే బంగారం అంటేనే మహిళలు బయపడే రోజులు వచ్చాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. అయితే నేడు మాత్రం పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇటీవల దూసుకెళ్తున్న బంగారం ధరకు కాస్తా బ్రేకులు పడ్డాయి. వివిధ నగరాల్లో రూ.వెయ్యి మేర బంగారం తగ్గింది. ఇదే సమయంలో వెండి ధర దాదాపు మూడు వేలు పెరిగింది. ఇక నేటి బంగారం, వెండి ధరల ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం...
శుక్రవారం (అక్టోబర్ 10న) హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,290 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,800 పలికింది. అలానే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,720 గా ఉంది. ఒక కేజీ వెండి ధర రూ. 1,80,000 పలికింది. బంగారం ధర నేడు భారీగా పెరిగింది. అలానే ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.1, 22,440కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 1, 12, 200 పలికింది. బంగారం ధరలు నిన్నటి తో పోల్చుకుంటే వెయ్యి రూపాయల మేర తగ్గాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం (gold market updates).
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
విజయవాడలో రూ. 1, 24, 160, రూ. 1, 13, 810
ముంబైలో రూ. 1, 22, 290, రూ. 1, 12, 100
కోల్‌కతాలో రూ.1,22,290, రూ.1,12,100
చెన్నైలో రూ. 1,22,840, రూ.1,12,600
బెంగళూరులో రూ. 1,22,290, రూ. 1,12,100
కేరళలో రూ. 1,22,290, రూ. 1,12,100
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
విజయవాడలో రూ. 1,80,000
ఢిల్లీలో రూ. 1,70,000
చెన్నైలో రూ. 1, 70, 010
కోల్‌కతాలో రూ. 1,70,000
కేరళలో రూ. 1,80,000
ముంబైలో రూ. 1,70,000
బెంగళూరులో రూ. 1,70,000
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.