Share News

Gold Price Update: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధరలు..

ABN , Publish Date - Nov 22 , 2025 | 07:51 AM

శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,23,980 దగ్గర ట్రేడ్ అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,13,650 దగ్గర ట్రేడ్ అయింది. 18 క్యారెట్ల ధర రూ. 92,900 దగ్గర ట్రేడ్ అయింది.

Gold Price Update: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధరలు..
Gold Price Update

గత కొద్దిరోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. బంగారం కొనాలనుకునే వారికి ఊరట కలిగిస్తున్నాయి. శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,23,980 దగ్గర ట్రేడ్ అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,13,650 దగ్గర ట్రేడ్ అయింది. 18 క్యారెట్ల ధర రూ. 92,900 దగ్గర ట్రేడ్ అయింది. శనివారం బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై పది రూపాయలు తగ్గి 1,23,970 దగ్గర ట్రేడ్ అవుతోంది. పది గ్రాముల 22, 18 క్యారెట్ల బంగారంపై కూడా 10 రూపాయల చొప్పున తగ్గింది.


22 క్యారెట్ల బంగారం రూ. 1,13,640 దగ్గర ట్రేడ్ అవుతోంది. 28 క్యారెట్ల బంగారం ధర రూ. 92,890 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక, వెండి ధరలు కూడా తగ్గాయి. నిన్న (శుక్రవారం)100 గ్రాముల వెండి 16,100 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి 1,61,000 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. 100 గ్రాముల వెండిపై 10 రూపాయలు.. కేజీ వెండిపై 100 రూపాయలు తగ్గింది. శనివారం 100 గ్రాముల వెండి ధర రూ.16,090 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర రూ. 1,60,900 దగ్గర ట్రేడ్ అవుతోంది.


దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం ధరలు (24 క్యారెట్లు ఒక గ్రాముకు)

  • హైదరాబాద్‌లో రూ. 12,397

  • విజయవాడలో రూ. 12,412

  • ఢిల్లీలో రూ. 12,412

  • ముంబైలో రూ. 12,397

  • వడోదరలో రూ. 12,402

  • కోల్‌కతాలో రూ. 12,397

  • చెన్నైలో రూ. 12,501

  • బెంగళూరులో రూ. 12,397

  • కేరళలో రూ. 12,397

  • పుణెలో రూ. 12,397

ముఖ్య గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాల్సి ఉంటుందని సూచన.


ఇవి కూడా చదవండి

అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఉగ్ర మూలాలు.. 600 మంది విద్యార్థుల జీవితం నాశనం!

హిడ్మా ఎన్‌కౌంటర్‌ బూటకం..

Updated Date - Nov 22 , 2025 | 12:51 PM