Gold Price Update: బంగారం కొనాలనుకునే వారికి షాక్.. పెరిగిన ధరలు..
ABN , Publish Date - Dec 13 , 2025 | 07:13 AM
శుక్రవారం 24 క్యారెట్ల బంగారం ధర 1,33,200 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,22,100 దగ్గర ట్రేడ్ అయింది. 18 క్యారెట్ల బంగారం ధర 99,900 దగ్గర ట్రేడ్ అయింది.
బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదు. సాధారణ, మధ్య తరగతి కుటుంబాల వారు బంగారం కొనాలన్న ఆలోచనలే చంపేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గత ఏడాది 60 వేల దగ్గర ఉన్న బంగారం ఇప్పుడు లక్షను దాటి పరుగులు పెడుతోంది. శుక్రవారం 24 క్యారెట్ల బంగారం ధర 1,33,200 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,22,100 దగ్గర ట్రేడ్ అయింది. 18 క్యారెట్ల బంగారం ధర 99,900 దగ్గర ట్రేడ్ అయింది.
ఈ రోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
ఈ రోజు (శనివారం) బంగారం ధరల విషయానికి వస్తే.. పది గ్రాముల 24,22,18 క్యారెట్ల బంగారంపై పది రూపాయలు పెరిగింది. ప్రస్తుతం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,33,210 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. పది గ్రాముల 22 క్యారెట్ల ధర 1,22,110 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 99,910 దగ్గర ట్రేడ్ అవుతోంది.
వెండి ధరలు ఇలా..
బంగారం ధరలను మించి వెండి ధరలు దూసుకువెళుతున్నాయి. పెట్టుబడులు పెట్టేవారికి వెండి బెస్ట్ ఆప్షన్ అని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వెండి ధరలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. నిన్న కేజీ వెండి ధర 2,15,000 దగ్గర ట్రేడ్ అయింది. 100 గ్రాముల వెండి ధర 21,500 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు (శనివారం) కేజీపై 100 రూపాయలు, 100 గ్రాములపై 10 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర 2,15,100 రూపాయల దగ్గర, 100 గ్రాముల వెండి ధర 21,510 దగ్గర ట్రేడ్ అయింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం ధరలు (24 క్యారెట్లు ఒక గ్రాముకు)
హైదరాబాద్ రూ. 13,320
విజయవాడ రూ. 13,320
ఢిల్లీ రూ. 13,335
ముంబై రూ. 13,320
వడోదర రూ. 13,325
కోల్‌కతా రూ. 13,320
చెన్నై రూ. 13,495
బెంగళూరు రూ. 13,320
కేరళ రూ. 13,320
పూణే రూ. 13,320
ఇవి కూడా చదవండ
మోసానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్
కెప్టెన్‌గా జేమ్స్ అండర్సన్.. 43 ఏళ్ల వయసులో!