Share News

Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు

ABN , Publish Date - Apr 17 , 2025 | 06:41 AM

To Day Gold Rate In Hyderabad: హైదరాబాద్‌ నగరంలో బంగారం ధరలు నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 88,150 రూపాయలు..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 96,170 రూపాయలు.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 72,130 రూపాయలుగా ఉండింది.

Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు
To Day Gold Rate In Hyderabad

ప్రపంచ వ్యాప్తంగా ఎప్పటికీ డిమాండ్ ఉండే వస్తువు ఏదైనా ఉంది అంటే.. అది కచ్చితంగా బంగారమే అని చెప్పాలి. పెట్టుబడి పెట్టాలనుకునే వారు.. ఎక్కువగా బంగారం వైపే మొగ్గుతూ ఉంటారు. ఇక, ఆడవాళ్లకు బంగారానికి ఉన్న అవినాభావసంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆడాళ్ల దగ్గర ఎంత బంగారం ఉన్నా.. ఇంకా కావాలి అనుకుంటారే తప్ప వద్దు అనరు. ఇండియన్ కల్చర్‌లో ఓ భాగం అయిన బంగారం ధరలు గత కొద్దిరోజుల నుంచి తగ్గుతూ వచ్చాయి. పసిడి ప్రియులు హమ్మయ్య అనుకునే లోపే మరో సారి పెరిగాయి. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి.


హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా..

నగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 88,150 రూపాయలు..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 96,170 రూపాయలు.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 72,130 రూపాయలుగా ఉండింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 96,180 రూపాయలు.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 88,160 రూపాయలు..10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 72,140 రూపాయలుగా ఉంది.


వెండి ధరలు ఇలా..

వెండి విషయానికి వస్తే.. హైదరాబాద్ నగరంలో ఒక గ్రాము వెండి ధర నిన్న 110 రూపాయలు ఉండింది. కేజీ వెండి ధర నిన్న 1,10,000 ఉండింది. ఈ రోజు వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. ఒక గ్రాము వెండి ధరపై 10 పైసలు పెరిగి.. 110.10గా ఉంది. కేజీ వెండి పెరిగిన ధర చూసుకుంటే.. 100 రూపాయలుగా ఉంది. ఈ రోజు వెండి ధర 1,10,100 దగ్గర ట్రేడ్ అవుతోంది. భవిష్యత్తులో బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.


ఇవి కూడా చదవండి

Supreme Court: కంచగచ్చిబౌలిలో ఆ వందెకరాలను పునరుద్ధరిస్తారా.. లేక జైలుకెళ్తారా?

Today Horoscope: ఈ రాశి వారికి కొంతకాలంగా ఎదురయ్యే సమస్యలు మాయమవుతాయి

Updated Date - Apr 17 , 2025 | 06:41 AM