Share News

అమెరికా-చైనా కయ్యం మనకు లాభమే

ABN , Publish Date - Feb 05 , 2025 | 06:04 AM

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మన దేశానికి మేలు చేస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 10 నుంచి చైనా దిగుమతులపై 35 శాతం సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా...

అమెరికా-చైనా కయ్యం మనకు లాభమే

న్యూఢిల్లీ: అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మన దేశానికి మేలు చేస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 10 నుంచి చైనా దిగుమతులపై 35 శాతం సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా ప్రకటించారు. దీంతో అమెరికా మార్కెట్లో చైనా వస్తువులు ప్రియం కానున్నాయి. ఈ లోటును భర్తీ చేసుకునేందుకు అమెరికా కంపెనీలు భారత్‌వైపు చూసే అవకాశం ఉందని భావిస్తున్నాయి. అయితే మన దేశానికి ఈ లాభం ఏ మేరకు ఉంటుందనే విషయం మన ఉత్పత్తి సామర్ధ్యం, పోటీతత్వాలపై ఆధారపడి ఉంటాయని భారత ఎగుమతి సంఘాల సమాఖ్య (ఫియో) డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌ సహాయ్‌ చెప్పారు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతో మన దేశం నుంచి ఆ దేశానికి ఎలక్ట్రిక్‌ మెషినరీ, వాటి విడి భాగాలు, ఆటోమొబైల్‌ విడి భాగాలు, మొబైల్‌, ఫార్మా, రసాయనాలు, బట్టలు, వస్త్రాల ఎగుమతి పుంజుకునే అవకాశం ఉందని సహాయ్‌ అంచనా వేశారు.


ఇవి కూడా చదవండి:

Ratan Tata: రతన్ టాటా యంగ్ ఫ్రెండ్ శంతను నాయుడికి టాటా మోటార్స్‌లో కీలక పదవి

8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 05 , 2025 | 06:04 AM