Share News

మూడో రోజూ కొనసాగిన జోరు

ABN , Publish Date - Jan 31 , 2025 | 02:45 AM

తీవ్ర ఆటుపోట్లతో సాగిన ట్రేడింగ్‌లో ఈక్విటీ మార్కెట్‌ మూడో రోజు కూడా ర్యాలీని కొనసాగించింది. ప్రధానంగా కార్పొరేట్‌ దిగ్గజాలు రిలయన్స్‌, ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎ్‌ఫసీ కౌంటర్లలో...

మూడో రోజూ కొనసాగిన జోరు

ముంబై: తీవ్ర ఆటుపోట్లతో సాగిన ట్రేడింగ్‌లో ఈక్విటీ మార్కెట్‌ మూడో రోజు కూడా ర్యాలీని కొనసాగించింది. ప్రధానంగా కార్పొరేట్‌ దిగ్గజాలు రిలయన్స్‌, ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎ్‌ఫసీ కౌంటర్లలో భారీ కొనుగోళ్లు గురువారం మార్కెట్‌కు ఉత్తేజం ఇచ్చాయి. ఆటుపోట్లతో సాగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 226.85 పాయింట్లు లాభపడి 76,759.81 వద్ద ముగిసింది. ఇంట్రాడేటో 429.92 పాయింట్ల మేరకు లాభపడి 76,962.88 వరకు వెళ్లింది. నిఫ్టీ 86.40 పాయింట్ల లాభంతో 23,249.50 వద్ద క్లోజైంది. కాగా ప్రస్తుతం అందరి దృష్టి శనివారం ప్రతిపాదించనున్న కేంద్ర బడ్జెట్‌ పైనే ఉంది. ఈ బడ్జెట్‌ మార్కెట్లో ప్రస్తుత బేరిష్‌ ట్రెండ్‌కు అడ్డుకట్ట వేయవచ్చన్నది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.


ఇవి కూడా చదవండి:

MahakumbhStampede: మహా కుంభమేళా తొక్కిసలాటపై సీఎం కీలక నిర్ణయం..

Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..

Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 31 , 2025 | 02:45 AM