హల్దిరామ్స్‌లో టెమాసెక్‌కు 10% వాటా
ABN , Publish Date - Mar 14 , 2025 | 04:24 AM
దేశంలో అతిపెద్ద ప్యాక్డ్ స్నాక్ అండ్ స్వీట్స్ కంపెనీ, రెస్టారెంట్ల ఆపరేటర్ హల్దిరామ్ స్నాక్స్ ఫుడ్‌లో 10 శాతం వాటాను సింగపూర్ ప్రభుత్వ పెట్టుబడి సంస్థ టెమాసెక్ కొనుగోలు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి....

జూరూ.8,500 కోట్లకు కొనుగోలు
జూదేశీయ ప్యాక్డ్ ఫుడ్ రంగంలో ఇప్పటివరకిదే అతిపెద్ద డీల్
హల్దిరామ్స్‌లో టెమాసెక్‌కు 10% వాటా
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్యాక్డ్ స్నాక్ అండ్ స్వీట్స్ కంపెనీ, రెస్టారెంట్ల ఆపరేటర్ హల్దిరామ్ స్నాక్స్ ఫుడ్‌లో 10 శాతం వాటాను సింగపూర్ ప్రభుత్వ పెట్టుబడి సంస్థ టెమాసెక్ కొనుగోలు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ఇరువర్గాల మధ్య విధిగా కట్టుబడి ఉండే ఒప్పందం ఈ నెల 11న (మంగళవారం) కుదిరినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ ఒప్పందంలో భాగం గా హల్దిరామ్ స్నాక్ ఫుడ్ మార్కెట్ విలువను 1,000 కోట్ల డాలర్లు (దాదాపు రూ.85,000 కోట్లు)గా లెక్కగట్టినట్లు సమాచారం. అంటే, సంస్థలో 10 శాతం వాటా కోసం టెమాసెక్ 100 కోట్ల డాలర్లు (రూ.8,500 కోట్లు) చెల్లించనుంది. దేశీయ ప్యాక్డ్ ఫుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకిదే అతిపెద్ద వాటా కొనుగోలు ఒప్పందం. అంతేకాదు, హల్దిరామ్ ప్రమోటర్లైన అగర్వాల్ కుటుంబం ప్రస్తుతం సంస్థలో 100 శాతం వాటా కలిగి ఉంది. అగర్వాల్ కుటుంబం వాటా విక్రయించడం ఇదే తొలిసారి. వ్యాపార విస్తరణకు నిధులు సమీకరించేందుకు సంస్థలో వాటా విక్రయించాలని అగర్వాల్ ఫ్యామిలీ గత కొన్ని నెలలుగా బ్లాక్‌స్టోన్, ఆల్ఫావేవ్, బెయిన్ క్యాపిటల్ సహా పలు ఇన్వెస్టర్లతో సంప్రదింపులు సాగించింది. గతంలో మెజారిటీ వాటా విక్రయం కోసం ప్రయత్నించినప్పటికీ మైనారిటీ వాటా ఉపసంహరణతో సరిపెట్టుకుంది.
మరో 5 శాతం వాటా విక్రయం!?
అగర్వాల్ కుటుంబం కంపెనీలో మరో 5 శాతం వాటాను విక్రయించే యోచనలో ఉన్నదని, ఇందుకోసం ఇతర ఇన్వెస్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌తో పాటు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అంతేకాదు, నిధుల సమీకరణ కోసం హల్దిరామ్ వచ్చే ఏడాది ఐపీఓకు సైతం వచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
1937లో ప్రారంభం: హల్దిరామ్స్ 1937లో రాజస్థాన్‌లోని బికనేర్‌లో కేవలం మిఠాయిలు, చిరుతిళ్ల విక్రయ కొట్టుగా ప్రారంభమైంది. గంగ బిషన్ అగర్వాల్ దీన్ని ప్రారంభించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి సంస్థగా అవతరించింది. హల్దిరామ్స్ ఉత్పత్తులను ప్రస్తుతం భారత్‌లోనే కాదు, 80కి పైగా దేశాల్లో విక్రయిస్తున్నారు. 2023-24లో కంపెనీ రూ.12,500 కోట్లకు పైగా ఆదాయం నమోదు చేసింది.
ఇవి కూడా చదవండి:
Gold Silver Rates Today: హోలీకి ముందే షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..
Read More Business News and Latest Telugu News