Technical View: జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో పరీక్ష
ABN , Publish Date - Nov 24 , 2025 | 01:15 AM
గత వారం నిఫ్టీ కీలక స్థాయి 26,000 వర కు వెళ్లి రియాక్షన్‌లో పడినప్పటికీ గురువారం తిరిగి కోలుకుని జీవితకాల గరిష్ఠ స్థాయి 26,300 వరకు వెళ్లింది. శుక్రవారం నాటి రియాక్షన్‌లో కూడా 26,000 కన్నా...
టెక్ వ్యూ: జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో పరీక్ష
గత వారం నిఫ్టీ కీలక స్థాయి 26,000 వర కు వెళ్లి రియాక్షన్‌లో పడినప్పటికీ గురువారం తిరిగి కోలుకుని జీవితకాల గరిష్ఠ స్థాయి 26,300 వరకు వెళ్లింది. శుక్రవారం నాటి రియాక్షన్‌లో కూడా 26,000 కన్నా పైనే నిలదొక్కుకుని 26,070 వద్ద ముగిసింది. గరిష్ఠ స్థాయిల్లో ప్రతిఘటన ఎదురవుతోందనేందు కు ఇది సంకేతం. టెక్నికల్‌గా మార్కెట్ అప్‌ట్రెండ్‌లోనే ఉంది. గత వారం 26,000 వద్ద బ్రేకౌట్ సాధించినందు వల్ల ఈ వారంలో పుల్‌బ్యాక్ రియాక్షన్ ఏర్పడవచ్చు. సుమారు ఏడాది తర్వాత మార్కెట్ మరోసారి జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో పరీక్షకు సమాయత్తం అవుతోంది. అప్రమత్తంగా ఉండాలి.
బుల్లిష్ స్థాయిలు: మరింత అప్‌ట్రెండ్ కోసం మార్కెట్ ప్రధాన నిరోధం 26,300 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ఆ పైన మరిన్ని ఉన్నత శిఖరాల దిశగా ప్రయాణం సాగిస్తుంది.
బేరిష్ స్థాయిలు: మార్కెట్ ప్రస్తుతం 26,000 కన్నా స్వల్పంగా పైన ఉంది. ఇక్కడ విఫలమైతే స్వల్పకాలిక బలహీనత ఏర్పడవచ్చు. ప్రధాన మద్దతు స్థాయిలు 25700, 25450.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ గత శుక్రవారం రియాక్షన్‌కు గురి కావడం గరిష్ఠ స్థాయిల్లో అప్రమత్త సంకేతం. పాజిటివ్ ట్రెండ్‌లో ప్రవేశించినట్టయితే నిరోధ స్థాయి 59,300 కన్నా పైన నిలదొక్కుకోవాలి. రియాక్షన్‌లో పడినా ప్రధాన మద్దతు స్థాయి 58,700 వద్ద నిలదొక్కుకోవాలి. విఫలమైతే మరింత బలహీనపడుతుంది. మరో ప్రధాన మద్దతు స్థాయి 58,000.
పాటర్న్: నిఫ్టీ గత శుక్రవారం రివర్స్ డౌన్‌సైడ్ బ్రేకౌట్ సాధించింది. గరిష్ఠ స్థాయిల్లో కన్సాలిడేషన్ లేదా రియాక్షన్ ఏర్పడవచ్చుననేందుకు ఇది సంకేతం. 26,000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ కన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత ఏర్పడుతుంది. గత వారం 26,300 వద్ద డబుల్ టాప్ పాటర్న్ ఏర్పడడం కూడా ఆ స్థాయిలో నిరోధం ఎదురవుతోందనేందుకు సంకేతం.
టైమ్ : ఈ సూచీ ప్రకారం బుధవారం తదుపరి మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 26,200, 26,300
మద్దతు : 26,000, 25,900
ఇవీ చదవండి:
అన్‌క్లెయిమ్డ్ బీమా మొత్తాలు క్లెయిమ్ చేసుకోవడం ఎలా
అమెజాన్‌లో భారీ లే ఆఫ్స్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పైనే ఎక్కువ ఎఫెక్ట్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి