Tech View: 25000 పైన నిలదొక్కుకోవడం కీలకం
ABN , Publish Date - Oct 06 , 2025 | 04:47 AM
నిఫ్టీ గత వారం పునరుజ్జీవం బాట పట్టి 240 పాయింట్లకు పైగా లాభంతో 24,900 వద్ద ముగిసింది. ముందు వారంలో ఏర్పడిన బలమైన డౌన్‌ట్రెండ్ అనంతరం ఏర్పడిన టెక్నికల్ రికవరీ ఇది. కాని మైనర్ రికవరీ...
టెక్ వ్యూ: 25000 పైన నిలదొక్కుకోవడం కీలకం
నిఫ్టీ గత వారం పునరుజ్జీవం బాట పట్టి 240 పాయింట్లకు పైగా లాభంతో 24,900 వద్ద ముగిసింది. ముందు వారంలో ఏర్పడిన బలమైన డౌన్‌ట్రెండ్ అనంతరం ఏర్పడిన టెక్నికల్ రికవరీ ఇది. కాని మైనర్ రికవరీ కావడం వల్ల పరిమిత కదలికలు మరి కొంత కాలం కొనసాగే ఆస్కారం ఉంది. నెలవారీగా చూసినా కనిష్ఠ స్థాయిల్లో ముగిసినప్పటికీ ఇంకా ప్రధాన మద్దతు స్థాయిల కన్నా పైనే ఉంది. మార్కెట్ ఎలాంటి కన్సాలిడేషన్ లేకుండానే గత వారంలో ‘వి’ ఆకారంలో రికవరీ సాధించినందువల్ల సానుకూల సంకేతం కోసం తొలుత కన్సాలిడేట్ అయి నిలదొక్కుకోవాలి. ప్రస్తుతం మానసిక అవధి 25,000 సమీపంలో ఉన్నందు వల్ల ఈ వారంలో అప్రమత్తంగా ప్రారంభమయ్యే ఆస్కారం ఉంది.
బుల్లిష్ స్థాయిలు: స్వల్పకాలిక సానుకూల సంకేతం ఇవ్వాలంటే మార్కెట్ కీలక నిరోధం 25,000 వద్ద నిలదొక్కుకోవడం తప్పనిసరి. గత కొద్ది నెలల్లో ఈ కీలక స్థాయిలోనే మార్కెట్ విఫలమవు తూ వస్తోంది. ప్రధాన నిరోధ స్థాయిలు 25300, 25500.
బేరిష్ స్థాయిలు: 25000 వద్ద విఫలమైతే అప్రమత్త సంకేతం ఇస్తుంది. దిగువన మద్దతు స్థాయి 24,700. ఇక్కడ విఫలమైతే మరింత బలహీనపడుతుంది. ప్రధాన స్వల్పకాలిక మద్దతు స్థాయి 24,500. ఇక్కడ కూడా విఫలమైతే స్వల్పకాలిక బలహీనతగా భావించి అప్రమత్తం కావాలి.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ గత వారం మంచి పనితీరుతో 1200 పాయింట్లకు పైగా బలపడి మూడు వారాల గరిష్ఠ స్థాయి 55,600 వద్ద ముగిసింది. ప్రధాన నిరోధం 55,600. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకుని తీరాలి. ప్రధాన మద్దతు స్థాయి 55,000. ఇక్కడ విఫలమైతే బలహీనత ముప్పు తప్పదు.
పాటర్న్: స్వల్పకాలిక చలన సగటు స్థాయి 25,000 కన్నా నిఫ్టీ స్వల్పంగా దిగువన ఉంది. సానుకూలత కోసం ఇదే స్థాయిలో ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ కన్నా పైన నిలదొక్కుకోవాలి.
టైమ్: ఈ సూచీ ప్రకారం బుధవారం తదుపరి మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 24920, 25000
మద్దతు : 24780, 24700
వి. సుందర్ రాజా
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి