Share News

Nifty Technical Analysis: 26,000 వద్ద నిలదొక్కుకోవడం కీలకం

ABN , Publish Date - Dec 29 , 2025 | 05:18 AM

గత వారం నిఫ్టీ 26,200 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమై వారం కనిష్ఠ స్థాయిలో ముగిసింది. గరిష్ఠ స్థాయిల్లో అమ్మకాల ఒత్తిడిని ఇది సూచిస్తోంది. బలంగా క్లోజ్‌...

Nifty Technical Analysis: 26,000 వద్ద నిలదొక్కుకోవడం కీలకం

టెక్‌ వ్యూ : 26,000 వద్ద నిలదొక్కుకోవడం కీలకం

గత వారం నిఫ్టీ 26,200 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమై వారం కనిష్ఠ స్థాయిలో ముగిసింది. గరిష్ఠ స్థాయిల్లో అమ్మకాల ఒత్తిడిని ఇది సూచిస్తోంది. బలంగా క్లోజ్‌ కాకపోయినా ఎలాంటి బలహీనత కూడా ప్రదర్శించలేదు. ముగింపు మాత్రం అనిశ్చితంగా ఉంది. ఈ కారణంగా తదుపరి దశను నిర్ధారించేందుకు మరింత కదలిక అవసరం.

మార్కెట్‌ ఇటీవల ఏర్పడిన గరిష్ఠ స్థాయి 26,300, కనిష్ఠ స్థాయి 25,700 మధ్యన ముగిసింది. ప్రధాన ట్రెండ్‌ ఇప్పటికీ పాజిటివ్‌గానే ఉంది. ఇక మిడ్‌క్యాప్‌-100 సూచీ పరిమిత పరిధిలోనే కదలాడి ఫ్లాట్‌గా ముగిసినా, స్మాల్‌క్యాప్‌-100 సూచీ మాత్రం కనిష్ఠ స్థాయిల నుంచి పునరుజ్జీవం సాధించి 304 పాయింట్ల లాభంతో ముగిసింది. మార్కెట్‌ ప్రస్తుత గరిష్ఠ స్థాయిల్లో మరోసారి పరీక్ష ఎదుర్కొనవచ్చు.

బుల్లిష్‌ స్థాయిలు: సానుకూలత కోసం నిఫ్టీ గత వారం గరిష్ఠ స్థాయి 26,200 వద్ద తప్పనిసరిగా నిలదొక్కుకోవాలి. ఆ పైన నిరోధ స్థాయి 26,350. కొద్ది వారాల క్రితం ఈ స్థాయి నుంచే మార్కెట్‌ కరెక్షన్‌లో పడింది.

బేరిష్‌ స్థాయిలు: 26,000 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమైతే బలహీనత సంకేతం ఇస్తుంది. ప్రధాన మద్దతు స్థాయి 25,700. ఇక్కడ కూడా విఫలమైతే స్వల్పకాలిక బలహీనత మరింతగా కొనసాగుతుంది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తం కావాలి. మరో ప్రధాన మద్దతు స్థాయి 25,450.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ గత కొద్ది వారాలుగా 60,300-59,000 పాయింట్ల మధ్యన కదలాడుతోంది. పాజిటివ్‌ ట్రెండ్‌లో ట్రేడయినట్టయితే నిరోధ స్థాయి 59,600 కన్నా పైన నిలదొక్కుకోవాలి. 59,000 కన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనతగా భావించి అప్రమత్తం కావాలి.

పాటర్న్‌: గత మూడు వారాలుగా 26,200 స్థాయిలో ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద మూడు టాప్‌లు ఏర్పడ్డాయి. స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కోసం ఈ రేఖ కన్నా పైన నిలదొక్కుకోవాలి. 26,000 స్థాయిలో ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద విఫలమైతే స్వల్పకాలిక బలహీనతను సూచిస్తుంది.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం బుధవారం తదుపరి మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 26,140, 26,200

మద్దతు : 26,000, 25,920

ఇవీ చదవండి

ఈ విషయాలు తెలుసా? పర్సనల్ లోన్ చెల్లించకుండానే రుణగ్రహీత మరణిస్తే..

మ్యూచువల్‌ ఫండ్స్‌ లాభాలపై పన్ను పోటు ఎంత

Updated Date - Dec 29 , 2025 | 05:18 AM