టెక్ వ్యూ : కన్సాలిడేషన్ అవకాశం
ABN , Publish Date - Feb 03 , 2025 | 06:45 AM
గత నాలుగు నెలలుగా నిరంతర డౌన్‌ట్రెండ్‌లో ఉన్న నిఫ్టీ 23,500 వద్ద మద్దతు తీసుకుంది. టెక్నికల్‌గా ఈ రికవరీతో తక్షణ డౌన్‌ట్రెండ్ ముప్పు నుంచి బయటపడింది. అయితే శుక్రవారం అమెరికన్ మార్కెట్లలో...

టెక్ వ్యూ : కన్సాలిడేషన్ అవకాశం
గత నాలుగు నెలలుగా నిరంతర డౌన్‌ట్రెండ్‌లో ఉన్న నిఫ్టీ 23,500 వద్ద మద్దతు తీసుకుంది. టెక్నికల్‌గా ఈ రికవరీతో తక్షణ డౌన్‌ట్రెండ్ ముప్పు నుంచి బయటపడింది. అయితే శుక్రవారం అమెరికన్ మార్కెట్లలో అప్రమత్త ట్రెండ్ కారణంగా ఈ వారంలో అప్రమత్తంగా ప్రారంభం కావచ్చు. 23,600 వద్ద నిఫ్టీ నిరోధం ఎదుర్కొంటోంది.
బుల్లిష్ స్థాయిలు: ప్రస్తుత స్థాయి ల్లో కన్సాలిడేషన్‌కు ఆస్కారం ఉంది. పాజిటివ్ ట్రెండ్ ప్రదర్శించినట్టయితే రాబోయే కొద్ది రోజుల్లో ప్రధాన నిరోధం 23,600 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ఆ పైన మరో ప్రధాన నిరోధం, టార్గెట్ 24,000.
బేరిష్ స్థాయిలు: మైనర్ మద్దతు స్థాయి 23,300 వద్ద విఫలమైతే మైనర్ బలహీనత ఎదుర్కొంటుంది. ప్రధాన మద్దతు స్థాయి 23,000. ఈ స్థాయి ప్రస్తుతం కొంత దూరంగా ఉన్నందు వల్ల సాధారణ పరిస్థితుల్లో ఎలాంటి తక్షణ ప్రమాదం లేదు.
బ్యాంక్ నిఫ్టీ: మరింత రికవరీ బాట పడితే స్వల్పకాలిక పాజిటివ్ ధోరణి కోసం ఈ సూచీ ప్రధాన నిరోధం 50,000 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన మద్దతు స్థాయి 49,000. ఈ స్థాయిలో నిలదొక్కుకోలేకపోతే స్వల్పకాలిక బలహీనత ఏర్పడుతుంది.
పాటర్న్: మార్కెట్ ప్రస్తుతం 10 వారాల చలన సగటు స్థాయి, 50 డిఎంఏ వద్ద నిలిచి ఉంది. ఇక్కడ నిలదొక్కుకోవాలి. అలాగే సానుకూల ట్రెండ్ ప్రదర్శించాలంటే 23,600 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ కన్నా పైన నిలదొక్కుకోవాలి.
టైమ్: ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం
స్థాయిలు : నిరోధం : 23,530, 23,600
మద్దతు : 22,370, 22,300
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News