Teach Children the Habit of Savings: పిల్లలకూ పొదుపు నేర్పండి
ABN , Publish Date - Dec 21 , 2025 | 05:50 AM
సంపాదనలో ఎంతో కొంత పిల్లల కోసం కూడబెట్టడంతోపాటు వారికీ చిన్నప్పటి నుంచే పొదుపు అలవాటు చేయండి. చేతి ఖర్చుల కోసం తల్లిదండ్రులిచ్చే పాకెట్ మనీ.. పిల్లలకు నగదు నిర్వహణను పరిచయం చేస్తుంది....
వారసుల కోసం డబ్బు దాచడంతోపాటు వారికి ఆదా చేయడమూ అలవాటు చేయాలి..
సంపాదనలో ఎంతో కొంత పిల్లల కోసం కూడబెట్టడంతోపాటు వారికీ చిన్నప్పటి నుంచే పొదుపు అలవాటు చేయండి. చేతి ఖర్చుల కోసం తల్లిదండ్రులిచ్చే పాకెట్ మనీ.. పిల్లలకు నగదు నిర్వహణను పరిచయం చేస్తుంది. పాకెట్ మనీ పిల్లలకు కొంత ఆర్థిక స్వేచ్ఛను కల్పించినప్పటికీ, నగదు నిర్వహణలో వారు కొన్ని పొరపాట్లు చేసే అవకాశమూ ఉంది. అయితే, చేతిలో వంద రూపాయలున్నప్పుడు బాల్యంలో చేసే చిన్న తప్పులు.. భవిష్యత్‌లో వేలు, లక్షల్లో సొమ్మును దుబారా చేయకుండా ఉండేలా గుణపాఠం నేర్పుతాయి. వారు పెద్దయ్యాక డబ్బు విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంతోపాటు పొదుపును అలవాటు చేసుకునేందుకు దోహదపడతాయి. అయితే, తామిచ్చిన పాకెట్ మనీని పిల్లలు ఎలా ఖర్చు చేస్తున్నారనే విషయంలో తల్లిదండ్రుల పర్యవేక్షణతో పాటు వారికి పొదుపుపై మార్గ నిర్దేశం చేయడం ఎంతో కీలకం. పిల్లలకు పొదుపును పరిచయం చేసేందుకు మీ ముందున్న మార్గాలు..
సేవింగ్స్ అకౌంట్
మీ వారసులకు డబ్బు ఆదాను నేర్పేందుకు తొలి మార్గం పొదుపు ఖాతా. మీ కుమారుడు లేదా కుమార్తె పేరిట ఏదైనా బ్యాంక్‌లో సాధారణ సేవింగ్స్ అకౌంట్ తెరవండి. ఖాతా నిర్వహణ మీ పర్యవేక్షణలోనే జరుగుతుంది. అయితే, చాలా బ్యాంక్‌లు పిల్లలకు పదేళ్లు వచ్చాక సొంతగా ఖాతా నిర్వహించేందుకు అనుమతిస్తున్నాయి. మీరిచ్చే పాకెట్ మనీలో కొంత మొత్తాన్ని ఆ ఖాతాలో దాచుకునేలా పిల్లల్ని ప్రోత్సహించండి. ఆ సొమ్ముపై ఎంత వడ్డీ లభిస్తుందనే విషయాన్ని తెలియజేయండి. సాధారణంగా సేవింగ్ అకౌంట్‌పై వార్షిక వడ్డీ బ్యాంక్‌ను బట్టి 2.5ు నుంచి 5ుశ్రేణిలో ఉంది.
డెబిట్ కార్డు కూడా ఉంటే మేలు..
లావాదేవీలపై పరిమితులు, పరిమిత ప్రయోజనాలతో కూడిన మైనర్ సేవింగ్ అకౌంట్లపై కొన్ని బ్యాంక్‌లు డెబిట్ కార్డులను కూడా ఆఫర్ చేస్తున్నాయి. అలాంటప్పుడు మీరు పాకెట్ మనీని నేరుగా వారి ఖాతాకు బదిలీ చేస్తే సరిపోతుంది. అకౌంట్‌లోని సొమ్మును పిల్లలు ఎలా, ఎక్కడ, ఎందుకోసం ఖర్చు చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు వీలవుతుంది. అంతేకాదు, పిల్లలకు డిజిటల్ చెల్లింపులు జరిపే సౌలభ్యమూ లభిస్తుంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్
మీ పిల్లల పేరిట కొంత సొమ్మును ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) చేయవచ్చు. సాధారణంగా ఎఫ్‌డీపై సేవింగ్స్ ఖాతా కంటే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ఎంచుకునే సమయాన్ని బట్టి ఎఫ్‌డీపై బ్యాంక్‌లు 5-8 శాతం వరకు వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. పిల్లల పేరిట జమ చేసిన డిపాజిట్ వారి చదువులు లేదా భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది.
డీమ్యాట్ అకౌంట్
స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ఎలా అని పిల్లలకు నేర్పేందుకు వారి పేరిటి డీమ్యాట్ ఖాతా తెరవచ్చు. ఏదైనా కంపెనీ షేరు ఎలా కొనుగోలు చేయాలి..? ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ఎలా పెట్టుబడులు పెట్టవచ్చు...? క్రమానుగుత పెట్టుబడి పథకాల్లో (సిప్) ఎలా ఇన్వెస్ట్ చేయాలి..? అనే విషయాలతోపాటు దీర్ఘ, మఽధ్య, స్వల్పకాలిక పెట్టుబడి వ్యూహాలను నేర్పేందుకు డీమ్యాట్ ఖాతా మంచి మార్గం. అయితే, డీమ్యాట్ అకౌంట్ తెరిచేందుకు మీ పిల్లల పేరిట బ్యాంక్ ఖాతా, పాన్ కార్డు, ఆధార్ కార్డు అవసరం. అయితే, పిల్లలు 18 ఏళ్లు వచ్చేంతవరకు సొంతంగా షేర్ల క్రయ, విక్రయాలు చేపట్టలేరు. వారికి 18 ఏళ్లు నిండాక కొత్త కైవేసీ సమర్పించడం ద్వారా దాన్ని రెగ్యులర్ డీమ్యాట్ ఖాతాగా మార్చుకునేందుకు వీలుంటుంది.
పోస్టాఫీస్ పథకాలు- సుకన్య సమృద్ధి యోజన
పెట్టుబడులపై రిస్క్ వద్దనుకునే వారు, స్థిర ఆదాయాన్ని కోరుకునే వారు పోస్టాఫీ్‌సల్లో ఆఫర్ చేసే చిన్న మొత్తాల పొదుపు పథకాలను ఎంచుకోవచ్చు. మీ పిల్లల పేరిట అకౌంట్‌ను ప్రారంభించి రికరింగ్ డిపాజిట్, టైమ్ డిపాజిట్‌తో పాటు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్‌ఎస్‌ఎస్)లో పొదుపు చేయడం ఆరంభించవచ్చు. బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్, ఎఫ్‌డీలతో పోలిస్తే ఈ పథకాలు కాస్త అధిక వడ్డీని అందిస్తాయి. ఒకవేళ మీకు పదేళ్లలోపు కూతురు ఉంటే, సుకన్య సమృద్ధి పథకంలోనూ పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ పథకం ప్రస్తుతం 8.2ు వార్షిక వడ్డీ ఆఫర్ చేస్తున్నది. పిల్లల ఉన్నత చదువులు, భవిష్యత్ అవసరాల కోసం ఆదా చేసేందుకు ఇవి ఉత్తమ మార్గాలు.
ఎన్‌పీఎ్‌స వాత్సల్య
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎ్‌స)కు ఇది మైనర్ వెర్షన్. పిల్లల పేరిట దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడులు పెట్టేందుకు, వారికి రిటైర్మెంట్ ప్లానింగ్‌ను నేర్పేందుకు ఈ మధ్యనే అందుబాటులోకి వచ్చిన మరో ప్రత్యామ్నాయం. కనీస వార్షిక పెట్టుబడి రూ.1,000. మీ కుమారుడు లేదా కుమార్తెకు 18 ఏళ్లు వచ్చాక ఈ ఎన్‌పీఎ్‌స వాత్సల్య అకౌంట్ సాధారణ ఎన్‌పీఎ్‌స టైర్-1 అకౌంట్‌గా మారుతుంది. అయితే, ఇందులో జమ చేసిన సొమ్మును మధ్యలో ఉపసంహరించుకునే వెసులుబాటు ఉండదు. పెట్టుబడి గడువు ముగిశాక కూడా అకౌంట్‌లోని కార్ప్‌సలో 80 శాతాన్ని యాన్యుటీలో పెట్టాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
ఉదయం పూట ఇలా చేస్తారా.. చిన్నతనంలోనే వార్ధక్య లక్షణాలు వస్తాయి జాగ్రత్త!
నా కుమారుడు రోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తాడు: నటుడు మాధవన్