టీసీఎస్ లాభం రూ.12,760 కోట్లు
ABN , Publish Date - Jul 11 , 2025 | 03:16 AM
ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గురువారం ప్రకటించిన తొలి త్రైమాసిక (ఏప్రిల్-జూన్) ఫలితాలు మార్కెట్ అంచనాలను అందు కోలేక పోయింది. ప్రధాన మార్కెట్లలో ఎదురీతతో పాటు...
జూన్ త్రైమాసిక లాభంలో 6% వృద్ధి.. ఒక్కో షేరుకు రూ.11 మధ్యంతర డివిడెండ్
న్యూఢిల్లీ/ముంబై: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గురువారం ప్రకటించిన తొలి త్రైమాసిక (ఏప్రిల్-జూన్) ఫలితాలు మార్కెట్ అంచనాలను అందు కోలేక పోయింది. ప్రధాన మార్కెట్లలో ఎదురీతతో పాటు గత కొన్ని త్రైమాసికాలుగా అండగా ఉన్న బీఎ్‌సఎన్‌ఎల్ డీల్‌ను రద్దు చేసుకున్న ప్రభావం ఫలితాలపై స్పష్టంగా కనిపించింది. నాన్ కోర్ ఆదాయాల వృద్ధి కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి కంపెనీ రూ.12,760 కోట్ల లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే లాభం 6ు వృద్ధి చెందింది. మరోవైపు ఈ కాలంలో కంపెనీ ఆదాయం రూపాయి మారకంలో 1.3ు వృద్ధి చెంది రూ.63,437 కోట్లుగా నమోదైనప్పటికీ స్థిర కరెన్సీ ఆదాయం మాత్రం 3ు క్షీణించింది.
ఇతరత్రా ఆదాయం గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే రూ.962 కోట్ల నుంచి రూ.1,660 కోట్లకు పెరిగింది. గతంలో చెల్లించిన ఆదాయపు పన్ను ఏకమొత్తంలో వాపసు రావడం కంపెనీ లాభాలకు దోహదపడింది. నిర్వహణాపరమైన లాభాల మార్జిన్ సైతం వార్షిక ప్రాతిపదికన 24.7ు నుంచి 24.5 శాతానికి తగ్గింది. అమెరికాలో ఆదాయం 2.7ు తగ్గడమే ఇందుకు కారణం. రూ.15,000 కోట్ల విలువ గల బీఎ్‌సఎన్‌ఎల్ రద్దు ప్రభావం వల్ల భారత్ నుంచి సమకూరే ఆదాయాలు కూడా 21.7ు తగ్గినట్టు ప్రకటించింది. అయితే బీఎ్‌సఎన్‌ఎల్ నుంచి రూ.2,900 కోట్ల యాడ్ ఆన్ వర్క్ వచ్చిందని, ఆ పని ఇంకా ప్రారంభించాల్సి ఉందని పేర్కొంది.
ఈ ఏడాది రెండంకెల ఆదాయ వృద్ధి అసాధ్యం
ప్రపంచవ్యాప్తంగా స్థూల ఆర్థిక, భౌగోళిక, రాజకీయ విభాగాల్లో కొనసాగుతున్న అస్థిరతల కారణంగా ఐటీ సర్వీసులకు డిమాండ్ క్షీణించిందని, ఈ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయాల్లో రెండంకెల వృద్ధి ఉంటుందని తాను భావించడంలేదని టీసీఎస్ ఎండీ, సీఈఓ కే కృతివాసన్ అన్నారు. ముందు త్రైమాసికంలో విధాన నిర్ణయాల్లో చోటు చేసుకున్న జాప్యం సైతం ఇప్పుడు మరింత తీవ్రమైందని ఆయన చెప్పారు. అయితే గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్ల ఆదాయాలు కొంత మెరుగ్గా ఉండవచ్చని తెలిపారు.
ఒకసారి అస్థిరతలన్నీ తొలగిపోతే ఐటీ కంపెనీల ఆదాయాల వృద్ధికి ప్రధాన చోదకమైన విచక్షణాత్మక వ్యయాలు సాధారణ స్థాయికి వస్తాయన్నారు. ఆగస్టు చివరి నాటికి తమకు ప్రధాన మార్కెట్ అయిన అమెరికాతో వాణిజ్య ఒప్పందం తుదిరూపు దిద్దుకోవడం, క్లయింట్లు వ్యయ నియంత్రణ పాటిస్తున్న కొన్ని అంశాలపై స్పష్టత రావడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చని కృతివాసన్ తెలిపారు. కాగా ఏఐ సేవలపై క్లయింట్లకు మరింత ఆసక్తి కనిపిస్తోందన్నారు. ఈ త్రైమాసికంలో కంపెనీ 940 కోట్ల డాలర్ల విలువ గల కొత్త డీల్స్ కుదుర్చుకుంది.
డివిడెండ్ రికార్డు తేదీ ఈ నెల 16
వాటాదారులకు రూపాయి ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.11 మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. డివిడెండ్‌కు అర్హత పొందేందుకు రికార్డు తేదీని జూలై 16గా నిర్ణయించారు. అంటే ఆ రోజుకి నమోదైన వాటాదారులందరికీ ఈ డివిడెండ్ లభిస్తుంది. డివిడెండ్‌ను ఆగస్టు 4వ తేదీ వాటాదారులకు చెల్లిస్తారు.
వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకోలేదు
ఈ ఏడాది వేతనాల పెంపుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మానవ వనరుల అధికారి మిలింద్ లక్కడ్ తెలిపారు. స్థూల ఆర్థిక వాతావరణం మెరుగుపడి వ్యాపా రం సైతం వృద్ధి చెందితే తాము తప్పనిసరిగా వేతనాల్లో మంచి వృద్ధినే ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.
6,000 నియామకాలు
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 6,000 మంది ఉద్యోగులను నియమించినట్టు టీసీఎస్ వెల్లడించింది. జూన్ ముగిసే నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,13,069గా ఉంది. కాగా జూన్ త్రైమాసికంలో ఉద్యోగుల వలసల రేటు 13.8 శాతంగా ఉంది.
ఇవి కూడా చదవండి
ఇన్‌కం ట్యాక్స్ 2025 కొత్త రూల్స్.. ఈ అప్‌డేట్ ప్రక్రియ తప్పనిసరి
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి