TCS Chiplet Services: సెమీకండక్టర్ పరిశ్రమ కోసం చిప్‌లెట్ ఆధారిత ఇంజనీరింగ్ సేవలు
ABN , Publish Date - Sep 12 , 2025 | 01:49 AM
ఐటీ దిగ్గజం టీసీఎస్ దేశీయ సెమీకండక్టర్ పరిశ్రమకు అవసరమైన చిప్‌లెట్ ఆధారిత ఇంజనీరింగ్ సర్వీసును అభివృద్ధి చేసింది. ఈ చిప్‌లెట్ ఆధారిత ఇంజనీరింగ్ సేవలు సెమీకండక్టర్ల తయారీకి...
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టీసీఎస్ దేశీయ సెమీకండక్టర్ పరిశ్రమకు అవసరమైన చిప్‌లెట్ ఆధారిత ఇంజనీరింగ్ సర్వీసును అభివృద్ధి చేసింది. ఈ చిప్‌లెట్ ఆధారిత ఇంజనీరింగ్ సేవలు సెమీకండక్టర్ల తయారీకి భారత్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో దోహదం చేస్తాయని టీసీఎస్ వెల్లడించింది. ఈ రంగం లో నూతన ఆవిష్కరణలకూ ఇది ఉపకరిస్తుందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం 4,500 కోట్ల డాలర్ల నుంచి 5,000 కోట్ల డాలర్ల వరకు ఉన్న భారత సెమీకండక్టర్ల మార్కెట్ 2030 నాటికి 10,000 కోట్ల డాలర్ల నుంచి 11,000 కోట్ల డాలర్లకు చేరనుంది. ఇలాంటి కీలక సమయంలో తాము అందించే ఈ సరికొత్త సేవలు భారత సెమీకండక్టర్ పరిశ్రమకు ఎంతగానో తోడ్పడతాయని టీసీఎస్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ విభాగం ప్రెసిడెంట్ వీ రాజన్న తెలిపారు.
ఇవి కూడా చదవండి
జడ్పిటీసీ ఎన్నికల్లోనే దిక్కు లేదు.. 2029 గురించి కలలెందుకు?
మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం