Tata Motors SUV Tata Sierra Returns: టాటా సియారా మళ్లీ వచ్చెన్
ABN , Publish Date - Nov 26 , 2025 | 02:08 AM
సుమారుగా రెండు దశాబ్దాల తర్వాత టాటా సియారా కారు మళ్లీ రోడ్లపైకి రాబోతోంది. ఈ ప్రముఖ బ్రాండ్ ను టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ (టీఎంపీవీ) సరికొత్త అవతారంలో అందుబాటులోకి తెచ్చింది...
ధర రూ.11.49 లక్షలు
ముంబై: సుమారుగా రెండు దశాబ్దాల తర్వాత టాటా సియారా కారు మళ్లీ రోడ్లపైకి రాబోతోంది. ఈ ప్రముఖ బ్రాండ్ ను టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ (టీఎంపీవీ) సరికొత్త అవతారంలో అందుబాటులోకి తెచ్చింది. తద్వా రా సంస్థ వేగంగా వృద్ధి చెందుతున్న మిడ్‌సైజ్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్‌యూవీ) విభాగంలోకి ప్రవేశించింది. మూడు ఇంజిన్ (రెండు పెట్రోల్, ఒకటి డీజిల్) ఆప్షన్లలో లభించనున్న ఈ కారు పరిచయ ధర రూ.11.49 లక్షలు. సియారా బుకింగ్స్‌ను డిసెంబరు 16 నుంచి ప్రారంభించనున్నట్లు, వచ్చే ఏడాది జనవరి 15 నుంచి కస్టమర్లకు వాహనాలను అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. సియారా ఎలక్ట్రిక్ వెర్షన్‌ను వచ్చే ఆర్థిక సంవత్సరంలో విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ప్రీమియం లుక్‌తో కూడిన ఈ కారులోని మూడు స్ర్కీన్లతో కూడిన ఇన్ఫోటెయిన్‌మెంట్ సిస్టమ్, 5జీ కనెక్టివిటీ, 2+ అడాస్ వంటి డిజిటల్ ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టీఎంపీవీ పేర్కొంది. హ్యుండయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకీ గ్రాండ్ విటారాకు పోటీగా టాటా కంపెనీ సియారాను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
ఇవీ చదవండి:
డిసెంబర్‌లో బ్యాంక్ హాలిడేస్ ఇవే.. ప్లాన్ చేస్కోండి.!
మీ చిన్నారులకు పాన్ కార్డ్ తీసుకోండి.. ఇన్వెస్ట్‌మెంట్‌పై అవగాహన కల్పించండి!