Share News

Tata Motors New SUV: టాటా మోటార్స్‌ నుంచి సరికొత్త సియెర్రా

ABN , Publish Date - Nov 16 , 2025 | 04:59 AM

టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ (టీఎంపీవీ).. సరికొత్త ఎస్‌యూవీ సియెర్రాను ఆవిష్కరించింది. ఈ నెల 25న కంపెనీ అధికారికంగా సియెర్రాను మార్కెట్లోకి విడుదల చేయనుంది...

Tata Motors New SUV: టాటా మోటార్స్‌ నుంచి సరికొత్త సియెర్రా

22 ఏళ్ల తర్వాత మళ్లీ మార్కెట్లోకి

ముంబై: టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ (టీఎంపీవీ).. సరికొత్త ఎస్‌యూవీ సియెర్రాను ఆవిష్కరించింది. ఈ నెల 25న కంపెనీ అధికారికంగా సియెర్రాను మార్కెట్లోకి విడుదల చేయనుంది. సరికొత్త లుక్‌, డిజైన్‌తో రూపొందించిన ఈ ఎస్‌యూవీ.. హ్యుండయ్‌ క్రెటా, మారుతి గ్రాండ్‌ విటారా, హోండా ఎలివేట్‌కు గట్టి పోటీనిస్తుందని అంచనా వేస్తున్నారు. 1991లో తొలిసారిగా టాటా మోటార్స్‌ సియెర్రాను మార్కెట్లోకి తీసుకురాగా 2003లో ఈ కారు ఉత్పత్తిని నిలిపివేసింది. భారతీయుల మనసును చూరగొన్న ఈ ఎస్‌యూవీని 22 ఏళ్ల తర్వాత మళ్లీ వినియోగదారుల అభిరుచులు, కలలకు అనుగుణంగా మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు టాటా మోటార్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, గ్లోబల్‌ డిజైన్‌ హెడ్‌ మార్టిన్‌ ఉలారిక్‌ తెలిపారు. ఈ ఎస్‌యూవీ ధర రూ.17 లక్షల నుంచి రూ.22 లక్షల మధ్యన ఉండొచ్చని అంచనా.

ఇవి కూడా చదవండి:

అమెరికాలో భారీ స్థాయిలో ఉద్యోగాల్లో కోతలు.. సంచలన నివేదికలో వెల్లడి

ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 16 , 2025 | 04:59 AM