Share News

త్వరలో హారియర్‌ ఈవీ

ABN , Publish Date - May 19 , 2025 | 04:21 AM

ఎలక్ట్రిక్‌ వాహన (ఈవీ) రంగంలో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాలని టాటా మోటార్స్‌ భావిస్తోంది. ఇందు లో భాగంగా హారియర్‌ ఈవీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ...

త్వరలో హారియర్‌ ఈవీ

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహన (ఈవీ) రంగంలో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాలని టాటా మోటార్స్‌ భావిస్తోంది. ఇందు లో భాగంగా హారియర్‌ ఈవీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) కంపెనీకి చెందిన సియెర్రా ఈవీ మార్కెట్లోకి రానుంది. వీటితో పాటు ఇప్పటికే మార్కెట్‌ చేస్తున్న ఈవీలకు మరిన్ని ఫీచర్లు జోడించబోతోంది. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో టాటా మోటార్స్‌ 65,000 ఈవీలను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 10 శాతం తక్కువ. దీంతో కొత్త మోడల్స్‌, ఉన్న మోడల్స్‌కు మరిన్ని ఫీచర్లు జోడించడం ద్వారా ఈవీ మార్కెట్లో దూసుకుపోవాలని కంపెనీ భావిస్తోంది.

టాటా ఈవీ మెగాచార్జర్స్‌: ఇంటర్‌సిటీ, అర్బన్‌ ఈవీ మొబిలిటీ కోసం టాటా ఈవీ వ్యూహాత్మకంగా హైస్పీడ్‌ చార్డర్జ్స్‌ సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. చార్జర్‌జోన్‌, స్టాటిక్‌తో కలిసి 10 టాటా ఈవీ మెగాచార్జర్స్‌ను ప్రారంభించింది. వ్యూహాత్మకంగా కొన్ని నగరాలు, హైవేలపై వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి

UPI New Rule: యూపీఐ కొత్త రూల్.. తప్పు చెల్లింపుల కట్టడి కోసం కీలక సౌకర్యం..

Jyoti Malhotra Case: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి షాకింగ్ ఫాక్ట్స్

Upcoming IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..

EPFO: ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన 5 కీలక మార్పుల గురించి తెలుసా మీకు..

Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 19 , 2025 | 04:21 AM