Tata Motors Passenger Vehicles: 2030 నాటికి 5 కొత్త ఈవీలు
ABN , Publish Date - Dec 24 , 2025 | 02:55 AM
దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ (టీఎంపీవీ).. విద్యుత్ వాహనాల (ఈవీ) విభాగానికి సంబంధించి భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఎలక్ట్రిక్ వాహన విక్రయాలు...
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్
న్యూఢిల్లీ: దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ (టీఎంపీవీ).. విద్యుత్ వాహనాల (ఈవీ) విభాగానికి సంబంధించి భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఎలక్ట్రిక్ వాహన విక్రయాలు 2.5 లక్షల యూనిట్లకు చేరుకున్న సందర్భంగా టీఎంపీవీ ఎండీ, సీఈఓ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి 5 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది సియెర్రా ఈవీ, పంచ్ ఈవీ కొత్త వెర్షన్‌తో పాటు 2026 చివరికల్లా ప్రీమియం ఈవీ అవిన్యను సైతం విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు. అలాగే కొత్త వాహనాలు, టెక్నాలజీల అభివృద్ధితో పాటు ఈవీ ఆవరణ వ్యవస్థను భారీగా విస్తరించేందుకు 2029-30 నాటికి రూ.16,000-18,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు శైలేష్ చంద్ర తెలిపారు. ప్రస్తుతం సంస్థ ఆరు ఈవీ మోడళ్లను మార్కెట్లో విక్రయిస్తోంది. దేశీయ ఈవీల విభాగంలో టీఎంపీవీ 45-50 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది.
ఇవీ చదవండి:
జోస్ అలుక్కాస్ ప్రచారకర్తగా దుల్కర్ సల్మాన్
ఈ ఏడాది ఐటీ నియామకాల్లో 16 శాతం వృద్ధి