Share News

Tata Group Takeover: టాటా మోటార్స్‌ చేతికి ఇటలీ కంపెనీ ఇవెకో

ABN , Publish Date - Jul 31 , 2025 | 02:19 AM

టాటా గ్రూప్‌ మరో భారీ టేకోవర్‌ చేసింది. ఇటలీ కేంద్రంగా పనిచేసే ట్రక్కుల తయారీ కంపెనీ ఇవెకో ఎన్‌వీ కంపెనీని 450 కోట్ల డాలర్లకు (సుమారు రూ.38,240 కోట్లకు కొనుగోలు చేసింది. టాటా గ్రూప్‌ చరిత్రలోనే ఇది...

Tata Group Takeover: టాటా మోటార్స్‌ చేతికి ఇటలీ కంపెనీ ఇవెకో

డీల్‌ విలువ రూ.38,240 కోట్లు

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ మరో భారీ టేకోవర్‌ చేసింది. ఇటలీ కేంద్రంగా పనిచేసే ట్రక్కుల తయారీ కంపెనీ ఇవెకో ఎన్‌వీ కంపెనీని 450 కోట్ల డాలర్లకు (సుమారు రూ.38,240 కోట్లకు కొనుగోలు చేసింది. టాటా గ్రూప్‌ చరిత్రలోనే ఇది అతి పెద్ద కొనుగోలు. ఇందుకోసం గత నెలన్నర రోజులుగా జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చి నట్టు టాటా మోటార్స్‌ బోర్డు బుధవారం ప్రకటించింది. ఈ డీల్‌లో భాగంగా ఇవెకో ఈక్విటీలో నూరు శాతం వాటాను పూర్తి నగదు చెల్లింపు పద్దతిలో టాటా గ్రూప్‌ కొనుగోలు చేస్తోంది. అయితే ఆ గ్రూప్‌లోని రక్షణ పరి కరాల విభాగం మాత్రం ఈ టేకోవర్‌ పరిధిలోకి రాదు. యూరప్‌, అమెరికా మార్కెట్లలో ఇవెకో గ్రూప్‌ ట్రక్కుల కు మంచి డిమాండ్‌ ఉంది. ఇది వ్యూహాత్మక కొనుగోలు అని, దీని ద్వారా జాతీయ-అంతర్జాతీయ మార్కెట్లలోనూ పోటీపడగలుగు తాం అని టాటా మోటార్స్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ అన్నారు

ఇవి కూడా చదవండి

రష్యాలో భారీ భూకంపం.. జపాన్, అమెరికాలో సునామీ అలర్ట్

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 31 , 2025 | 02:19 AM