Share News

ఐపీఓకు టాటా క్యాపిటల్‌

ABN , Publish Date - Jun 22 , 2025 | 04:30 AM

టాటా గ్రూప్‌నకు చెందిన నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఎన్‌బీఎ్‌ఫసీ) టాటా క్యాపిటల్‌ మెగా పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం...

ఐపీఓకు టాటా క్యాపిటల్‌

రూ.17,200 కోట్ల సమీకరణ లక్ష్యం

టాటా గ్రూప్‌నకు చెందిన నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఎన్‌బీఎ్‌ఫసీ) టాటా క్యాపిటల్‌ మెగా పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం లభించినట్లు తెలిసింది. కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్‌ 5న సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాల (డీఆర్‌హెచ్‌పీ)ను సమర్పించింది. ఐపీఓ వివరాలను బయటికి వెల్లడించకుండా ఉండే వెసులుబాటుతో కూడిన గోప్య మార్గాన్ని (కాన్ఫిడెన్షియల్‌ ఫైలింగ్‌) ఇందుకు ఎంచుకుంది. అయితే, ఐపీఓ ద్వారా టాటా క్యాపిటల్‌ రూ.17,200 కోట్ల వరకు సమీకరించనున్నట్లు సమాచారం. తద్వారా దేశీయ ఆర్థిక సేవల రంగంలో ఇదే అతిపెద్ద ఐపీఓ కానుంది. అంతేకాదు, ఈ ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే అతిపెద్ద ఇష్యూ అవుతుంది.

ఇవీ చదవండి:

సేవింగ్స్ అకౌంట్‌లో మీ డబ్బు ఉందా.. అయితే మీరీ విషయాలు తప్పక తెలుసుకోవాలి

మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 22 , 2025 | 04:31 AM