Share News

Tata Capital: టాటా క్యాపిటల్‌ రూ.17,200 కోట్ల ఐపీఓ

ABN , Publish Date - Aug 06 , 2025 | 01:32 AM

టాటా గ్రూప్‌నకు చెందిన నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ ఎన్‌బీఎ్‌ఫసీ టాటా క్యాపిటల్‌ నవీకరించిన ఐపీఓ పత్రాలను

Tata Capital: టాటా క్యాపిటల్‌ రూ.17,200 కోట్ల ఐపీఓ

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ (ఎన్‌బీఎ్‌ఫసీ) టాటా క్యాపిటల్‌ నవీకరించిన ఐపీఓ పత్రాలను (డీఆర్‌హెచ్‌పీ) సెబీకి సమర్పించింది. ఐపీఓ ద్వారా కంపెనీ 200 కోట్ల డాలర్ల (రూ.17,200 కోట్లు) వరకు సమీకరించాలని భావిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ లెక్కన కంపెనీ మార్కెట్‌ విలువ దాదాపు 1,100 కోట్ల డాలర్ల (రూ.94,600 కోట్లు) స్థాయిలో ఉండనుందని వారన్నారు. సెబీకి సోమవారం సమర్పించిన అప్‌డేటెడ్‌ డీఆర్‌హెచ్‌పీ ప్రకారం.. ఐపీఓలో భాగంగా టాటా క్యాపిటల్‌ మొత్తం 47.58 కోట్ల షేర్లను విక్రయించనుంది. అందులో 21 కోట్ల తాజా ఈక్విటీ షేర్ల జారీతో పాటు ప్రమోటర్లు, ఇతర వాటాదారులకు చెందిన 26.58 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) పద్ధతిన అమ్మకానికి పెట్టనుంది. ఓఎ్‌ఫఎ్‌సలో భాగంగా కంపెనీ ప్రమోటరైన టాటా సన్స్‌ తన వాటా నుంచి 23 కోట్ల షేర్లను, ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఎ్‌ఫసీ) 3.58 కోట్ల షేర్లను ఉపసంహరించుకోనున్నాయి. ప్రస్తుతం టాటా క్యాపిటల్‌లో టాటా సన్స్‌ 88.6 శాతం, ఐఎ్‌ఫసీ 1.8 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఐపీఓలో తాజా ఈక్విటీ జారీ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీ టైర్‌-1 మూలధన నిధులను పెంచుకునేందుకు, భవిష్యత్‌ మూలధన అవసరాలు, రుణ వితరణ కోసం వినియోగించుకోనుంది.

సెన్సెక్స్‌ 308 పాయింట్లు పతనం

ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ బుధవారం వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో ఈక్విటీ మదుపరులు ముందు జాగ్రత్తగా ఇంధనం, బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలకు పాల్పడ్డారు. దాంతో బీఎ్‌సఈ సెన్సెక్స్‌ మంగళవారం ట్రేడింగ్‌లో 308.47 పాయింట్లు కోల్పోయి 80,710.25 వద్దకు జారుకుంది. నిఫ్టీ 73.20 పాయింట్ల నష్టంతో 24,649.55 వద్ద ముగిసింది.

ఆల్‌టైం కనిష్ఠానికి రూపాయి: భారత కరెన్సీ విలువ సరికొత్త జీవితకాల కనిష్ఠానికి పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 22 పైసల నష్టంతో రూ.87.88 వద్ద ముగిసింది. భారత వస్తువులపై సుంకాలను మరింత పెంచుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించడం, ఈక్విటీ మార్కెట్లో నష్టాలు మన కరెన్సీపై ఒత్తిడి పెంచాయి.

Updated Date - Aug 06 , 2025 | 01:32 AM