Tata-Boeing: హైదరాబాద్‌లో టాటా- బోయింగ్ ఏరోస్పేస్ నుంచి అపాచీ హెలీకాఫ్టర్ ఫ్యూజ్‌లేజ్‌లు..!
ABN , Publish Date - Feb 10 , 2025 | 01:28 PM
బోయింగ్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సంస్థలు హైదరాబాద్‌లో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బోయింగ్ AH-64 అపాచీ హెలికాప్టర్ ఫ్యూజ్‌లేజ్‌లు, ఇతర ఏరోస్ట్రక్చర్‌లను ఉత్పత్తి చేయడానికి, అలాగే ఏరోస్పేస్‌లో ఇంటిగ్రేటెడ్ సిస్టమ్‌లను అనుసరించడానికి ఈ జాయింట్ వెంచర్‌ను రెండు సంస్థలు కలిసి 2015లో స్థాపించాయి.

బోయింగ్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సంస్థలు హైదరాబాద్‌లో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బోయింగ్ AH-64 అపాచీ హెలికాప్టర్ ఫ్యూజ్‌లేజ్‌లు, ఇతర ఏరోస్ట్రక్చర్‌లను ఉత్పత్తి చేయడానికి, అలాగే ఏరోస్పేస్‌లో ఇంటిగ్రేటెడ్ సిస్టమ్‌లను అనుసరించడానికి ఈ జాయింట్ వెంచర్‌ను రెండు సంస్థలు కలిసి 2015లో స్థాపించాయి. తాజాగా హైదరాబాద్ నుంచి రెండు సంస్థలు కలిసి 300వ AH-64 అపాచీ హెలీకాఫ్టర్ ఫ్యూజ్‌లేజ్‌లను డెలివరీ చేసింది. ఓ భారీ ట్యూబ్‌లాంటి విమానం అవుటర్ బాడీలను ఇక్కడ తయారు చేస్తారు.
హైదరాబాద్‌లో తయారయ్యే ఈ ఫ్యూజ్‌లేజ్‌లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు సరఫరా చేస్తారు. యూఎస్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీకి కూడా కావాల్సిన ఆపాచీ హెలికాఫ్టర్ల ఫ్యూజ్‌లేజ్‌ను హైదరాబాద్‌లోనే తయారు చేస్తారు. భారత వైమానిక దళం వద్ద ప్రస్తుతం 22 AH-64 అపాచీ హెలీకాఫ్టర్లు ఉన్నాయి. కాగా, హైదరాబాద్‌లోని ఈ ఉత్పత్తి కేంద్రం 14000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ AH-64 అపాచీ హెలీకాఫ్టర్ ఫ్యూజ్‌లేజ్‌లను, సెకెండరీ స్ట్రక్చర్లను తయారు చేస్తారు.
అంతర్జాతీయ క్లయింట్ల కోసం స్పార్ బాక్స్‌ల వంటి ఏరో స్ట్రక్చర్‌లను రూపొందిస్తారు. హైదరాబాద్ కేంద్రం AH-64 అపాచీ హెలీకాఫ్టర్ ఫ్యూజ్‌లేజ్‌ల సరఫరా కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏరో స్ట్రక్చర్‌లను అసెంబుల్ చేయడానికి ఉపయోగపడే విడి భాగాల్లో 90 శాతం వరకు దేశీయంగానే తయారవుతాయి. దేశంలో ఉన్న చిన్న, మధ్య, సూక్ష్మ తరహా పరిశ్రమల నుంచి ఈ విడి భాగాలను సేకరించి ఏరో స్ట్రక్చర్‌లను రూపొందిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..