Share News

Nirmala Sitharaman Global Trade Tariffs: సుంకాలే ఆయుధాలయ్యాయ్‌

ABN , Publish Date - Dec 18 , 2025 | 06:37 AM

ప్రపంచ వాణిజ్య మార్కెట్లో కొన్ని దేశాలు సుంకాలు, ఇతర చర్యలను ఆయుధాలు గా మలుచుకుంటున్నాయని, ఈ నేపథ్యంలో భారత్‌ చాలా జాగ్రత్తగా సంప్రదింపులు జరపా ల్సి వస్తున్నదని...

Nirmala Sitharaman Global Trade Tariffs: సుంకాలే ఆయుధాలయ్యాయ్‌

న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్య మార్కెట్లో కొన్ని దేశాలు సుంకాలు, ఇతర చర్యలను ఆయుధాలు గా మలుచుకుంటున్నాయని, ఈ నేపథ్యంలో భారత్‌ చాలా జాగ్రత్తగా సంప్రదింపులు జరపా ల్సి వస్తున్నదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం ఇక స్వేచ్ఛాయుతం, అనుకూ లం ఏ మాత్రం కాదన్న విషయం స్పష్టమైందని టైమ్స్‌ నెట్‌వర్క్‌ ఇండి యా ఎకనామిక్‌ కాంక్లేవ్‌లో ఆమె పేర్కొన్నారు. అమెరికా తర్వాత తాజాగా మెక్సికో కూడా భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అప్పుల తగ్గింపుపై దృష్టి : ఆర్థిక నిర్వహణలో పాదర్శకత్వం, దేశ రుణ భారం తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుందని సీతారామన్‌ అన్నారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యాలను చేరుకునేందుకు రాష్ట్రాలు కూడా ఇదే బాటను అనుసరించాలని మంత్రి కోరారు.

55-Business.jpg

8% వృద్ధితోనే వికసిత్‌ భారత్‌ సాధ్యం: గీతా గోపీనాథ్‌

వచ్చే 20 ఏళ్లపాటు 8% వృద్ధితో దూసుకెళ్లగలిగితే 2047 నాటికి వికసిత్‌ భారత్‌గా ఎదగాలన్న లక్ష్యాలకు చేరువయ్యేందుకు అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐఎంఎఫ్‌ మాజీ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ అన్నారు. అయితే, 20 ఏళ్ల సుదీర్ఘకాలంపాటు నిలకడగా 8 శాతం వార్షిక వృద్ధిని సాధించడం అంత సులువు కాదని, ఎప్పటికప్పుడు సంస్కరణలు చేపట్టాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయ పడ్డారు.

ఇవీ చదవండి:

జీవితకాల కనిష్ఠ స్థాయికి చేరిన రూపాయి

యశోద హాస్పిటల్స్‌, ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ పబ్లిక్‌ ఇష్యూలకు సెబీ ఓకే

Updated Date - Dec 18 , 2025 | 06:37 AM