Share News

Telecom In 2026: కస్టమర్లకు షాక్ ఇవ్వడానికి సిద్ధమైన టెలికాం కంపెనీలు.. భారీగా పెరగనున్న రీఛార్జ్ ధరలు..

ABN , Publish Date - Dec 18 , 2025 | 12:14 PM

2026లో అన్ని టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలు పెంచే అవకాశం ఉంది. 16 నుంచి 20 శాతం టారీఫ్‌లు పెంచే అవకాశం ఉంది. ఈ నిర్ణయం 4జీ, 5జీ ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్స్‌కు వర్తిస్తుంది.

Telecom In 2026: కస్టమర్లకు షాక్ ఇవ్వడానికి సిద్ధమైన టెలికాం కంపెనీలు.. భారీగా పెరగనున్న రీఛార్జ్ ధరలు..
Telecom In 2026

దేశ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్‌ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇంటర్‌నెట్ వినియోగంలో భారత్ ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది. జియో విప్లవం తర్వాత టెలికాం రంగంలో చాలా మార్పులు వచ్చాయి. తక్కువ ధరకే అన్‌ లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఇంటర్‌నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, గత కొన్నేళ్లుగా అన్ని టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను భారీగా పెంచేస్తున్నాయి. ప్రతీ ఏటా కస్టమర్లకు షాకుల మీద షాకులు ఇస్తూ ఉన్నాయి. 2024లో రీఛార్జ్ ధరలు భారీగా పెరిగాయి. అన్ని టెలికాం కంపెనీలు టారీఫ్‌లకు సంబంధించి రెండేళ్ల సైకిల్‌ను ఫాలో అయ్యాయి. ఇందులో భాగంగా రెండేళ్లకు ఒకసారి మాత్రమే రీఛార్జ్ ధరలు పెంచాలని డిసైడ్ అయ్యాయి.


అందుకే 2025లో ధరలు పెంచలేదు. 2026తో ఆ సైకిల్ ముగిసింది. దీంతో 2026లో ధరలు పెంచే అవకాశం ఉంది. మోర్గాన్ స్టేన్‌లే తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. వచ్చే ఏడాది టెలికాం కంపెనీలు టారీఫ్‌లను భారీగా పెంచే అవకాశం ఉంది. అది కూడా 16 నుంచి 20 శాతం టారీఫ్‌లు పెంచే అవకాశం ఉంది. ఈ నిర్ణయం 4జీ, 5జీ ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్స్‌కు వర్తిస్తుంది. 2027 నాటికి యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ARPU) పెంచే ఉద్దేశ్యంతో టెలికాం కంపెనీలు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం చాలా టెలికాం కంపెనీలు 5జీ డేటాను ఉచితంగా అందిస్తున్నాయి. 2026లో ఉచిత 5జీ సేవలు పూర్తి స్థాయిలో నిలిచిపోయే అవకాశం ఉంది.


శాటిలైట్ ఇంటర్‌నెట్..

దేశంలో శాటిలైట్ ఇంటర్‌నెట్‌ను అందుబాటులోకి తీసుకురావటానికి గత రెండేళ్ల నుంచి గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది. స్టార్ లింక్ కంపెనీ ఇప్పటికే అన్ని అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేసింది. స్పెక్ట్రమ్ అలొకేషన్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి కోసం చూస్తోంది. ట్రాయ్ కూడా స్టార్‌లింక్‌కు సంబంధించిన రికమెండేషన్స్‌ను ప్రభుత్వం ముందు ఉంచింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టే స్టార్ లింక్ భవిష్యత్తు ఉంటుంది. 2026లో శాటిలైట్ ఇంటర్‌నెట్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అడవుల్లో కూడా శాటిలైట్ ఇంటర్‌నెట్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.


ఇవి కూడా చదవండి

హైటెన్షన్.. బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల వద్ద భారీగా పోలీసులు

ఛీ మీరసలు మనుషులేనా.. గండిపేట చెరువులో పాడు పనికి యత్నం..

Updated Date - Dec 18 , 2025 | 12:19 PM