Sewage Waste Into Gandipet Lake: ఛీ మీరసలు మనుషులేనా.. గండిపేట చెరువులో పాడు పనికి యత్నం..
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:31 AM
గండిపేట వాసుల దప్పిక తీరుస్తున్న గండిపేట్ చెరువులో ఓ వ్యక్తి సెప్టిక్ ట్యాంకర్ ద్వారా మలమూత్ర వ్యర్థాలను వదిలే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికులు వాటర్ బోర్డు అధికారులు ఫిర్యాదు చేశారు.
మనుషుల్లో స్వార్థం పెరిగిపోయింది. ప్రాణాలు నిలుపుతున్న ప్రకృతినే పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దారుణమైన పనులకు తెగబడుతున్నారు. పట్టణాలలోని కొంతమంది చేస్తున్న పనులు చూస్తే ... ‘వీళ్లసలు మనుషులేనా?’ అనిపించకమానదు. పర్యావరణాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాట్లుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ సంఘటన ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. గండిపేట వాసుల దప్పిక తీరుస్తున్న గండిపేట్ చెరువులో ఓ వ్యక్తి సెప్టిక్ ట్యాంకర్ ద్వారా మలమూత్ర వ్యర్థాలను వదిలే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికులు వాటర్ బోర్డు అధికారులు ఫిర్యాదు చేశారు.
సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నిన్న(బుధవారం) సింగరేణి కాలనీ, సైదాబాద్‌కి చెందిన శివ అనే వ్యక్తి గండిపేట్ చెరువులో సెప్టిక్ ట్యాంకర్ ద్వారా మలమూత్ర వ్యర్థాలను వదిలే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికులు వాటర్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై అధికారులు స్పందించారు. పోలీసులతో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లారు. ఓ సెప్టిక్ ట్యాంకర్ హిమాయత్ నగర్ గ్రామంలోని ఎఫ్టీఎల్ పాయింట్ నెంబర్ 428 వద్ద ఉన్న ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్‌లో మలమూత్ర వ్యర్థాలను పోస్తూ కనిపించింది. పోలీసులు శివను పట్టుకుని విచారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
ప్రపంచంలోనే టాప్ క్రిస్మస్ షాపింగ్ డెస్టినేషన్స్ ఇవే..
సన్నబడిన శ్వాసనాళానికి చికిత్స..