మార్కెట్లో లాభాల స్వీకరణ
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:28 AM
ఆర్‌బీఐ ద్రవ్యపరపతి సమీక్షకు ముందు అప్రమత్తతతో ఈక్విటీ మదుపరులు లాభాల స్వీకరణకు పాల్పడటంతో సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి...

213 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
ముంబై: ఆర్‌బీఐ ద్రవ్యపరపతి సమీక్షకు ముందు అప్రమత్తతతో ఈక్విటీ మదుపరులు లాభాల స్వీకరణకు పాల్పడటంతో సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు తరలిపోవడమూ మార్కెట్‌ను కుంగదీసింది. గురువారం లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్.. తొలి గంటలోనే నష్టాల్లోకి మళ్లింది. ఒక దశలో 427 పాయింట్లు క్షీణించిన సూచీ.. చివరికి 213.12 పాయింట్ల నష్టంతో 78,058.16 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 92.95 పాయింట్లు కోల్పోయి 23,603.35 వద్దకు జారుకుంది.
12 నుంచి హెక్సావేర్ టెక్నాలజీస్ ఐపీఓ: ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం కార్లైల్ గ్రూప్ పెట్టుబడులు కలిగిన మధ్య స్థాయి ఐటీ కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) ఈ నెల 12న ప్రారంభమై 14న ముగియనుంది. ఐపీఓలో భాగంగా షేర్ల విక్రయ ధరల శ్రేణిని కంపెనీ రూ.674-708గా నిర్ణయించింది.
మరో రికార్డు కనిష్ఠానికి రూపాయి: భారత కరెన్సీ సరికొత్త రికార్డు కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 16 పైసలు క్షీణించి రూ.87.59 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్లో నష్టాలు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడంతో పాటు డొనాల్డ్ ట్రంప్ సుంకాల దెబ్బతో అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్లో పెరిగిన అనిశ్చితి రూపాయి క్షీణతకు కారణమవుతున్నాయని ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి.
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News