Relief to Vodafone Idea: సుప్రీం లో వొడాఫోన్‌కు ఊరట
ABN , Publish Date - Oct 28 , 2025 | 02:30 AM
పీకల్లోతు అప్పులు, నష్టాలతో కునారిల్లుతున్న వొడాఫోన్ ఐడియాకి సోమవారం సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీ చెల్లించాల్సిన రూ.5,606 కోట్ల సర్దుబాటు చేసిన...
ఏజీఆర్‌లపై కేంద్రానికి స్వేచ్ఛ
న్యూఢిల్లీ: పీకల్లోతు అప్పులు, నష్టాలతో కునారిల్లుతున్న వొడాఫోన్ ఐడియాకి సోమవారం సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీ చెల్లించాల్సిన రూ.5,606 కోట్ల సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ (ఏజీఆర్) నిర్ణయ అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి వదిలేసింది. వొడాఫోన్ ఇండియా దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, న్యాయమూర్తి జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏజీఆర్ మొత్తాన్ని తిరిగి లెక్కించి, కంపెనీకి ఓదార్పు ప్రకటించేందుకు మార్గం సుగమమైంది. ఈ ఆదేశాలతో సోమవారం బీఎ్‌సఈలో వొడాఫోన్ ఐడియా షేరు 3.88 శాతం లాభంతో రూ.9.99 వద్ద ముగిసింది.
ఇవీ చదవండి:
నవంబరు 1 నుంచి బ్యాంకుల్లో వచ్చే మార్పులివే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి