Share News

స్థిరంగా సిమెంట్‌ డిమాండ్‌

ABN , Publish Date - May 19 , 2025 | 04:18 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)పై సిమెంట్‌ పరిశ్రమ చాలా ఆశలు పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం డిమాండ్‌ 7 నుంచి 7.5 శాతం వరకు పెరిగే అవకాశం...

స్థిరంగా సిమెంట్‌ డిమాండ్‌

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)పై సిమెంట్‌ పరిశ్రమ చాలా ఆశలు పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం డిమాండ్‌ 7 నుంచి 7.5 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ‘ఇక్రా’ రేటింగ్‌ సంస్థ అంచనా. 2024 -25 మార్చి త్రైమాసికంలో కంపెనీల సిమెంట్‌ అమ్మకాల పరిమాణం 3.5 నుంచి 10 శాతం వరకు పెరిగింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, గ్రామీణ డిమాండ్‌ పుంజుకోవడం ఇందుకు ప్రధానంగా కలిసి వస్తోంది.

ధరలపై నిరాశే: గత ఆర్థిక సంవత్సరం ప్రముఖ కంపెనీల బస్తా (50 కిలోలు) సిమెంట్‌ ధర ఒక దశలో రూ.300కు పడిపోయింది. మార్చి నెలాఖరులో మాత్రమే ఇది రూ.350కి చేరింది. 2024-25లో కంపెనీలకు బస్తాకు సగటున రూ.340కి మించి రాలేదు. 2023-24తో పోలిస్తే ఇది 7 శాతం తక్కువ

ఇవి కూడా చదవండి

UPI New Rule: యూపీఐ కొత్త రూల్.. తప్పు చెల్లింపుల కట్టడి కోసం కీలక సౌకర్యం..

Jyoti Malhotra Case: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి షాకింగ్ ఫాక్ట్స్

Upcoming IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..

EPFO: ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన 5 కీలక మార్పుల గురించి తెలుసా మీకు..

Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 19 , 2025 | 04:18 AM