Indian Stock Market: మూడో రోజూ నష్టాల్లోనే మార్కెట్
ABN , Publish Date - Nov 26 , 2025 | 02:04 AM
స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజూ నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 313.70 పాయింట్లు కోల్పో యి 84,587.01 వద్దకు జారుకోగా.. నిఫ్టీ 74.70 పాయింట్లు తగ్గి 25,884.80 వద్ద స్థిరపడింది. ఐటీ, ఆటో రంగ షేర్లలో...
ముంబై: స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజూ నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 313.70 పాయింట్లు కోల్పో యి 84,587.01 వద్దకు జారుకోగా.. నిఫ్టీ 74.70 పాయింట్లు తగ్గి 25,884.80 వద్ద స్థిరపడింది. ఐటీ, ఆటో రంగ షేర్లలో అమ్మకాలతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ ఇందుకు కారణం.
వచ్చేనెల 1 నుంచి పీసీ డయాగ్నోస్టిక్స్ ఐపీఓ
పీసీ డయాగ్నోస్టిక్స్ పేరుతో ముంబై కేంద్రంగా కార్యకలపాలు సాగిస్తున్న ఇన్విక్టా డయాగ్నోస్టిక్స్ లిమిటెడ్ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) వచ్చే నెల 1న ప్రారంభమై 3న ముగియనుంది. ఐపీఓ ధరల శ్రేణిని కంపెనీ రూ.80-85గా నిర్ణయించింది.
భారీగా పెరిగి బంగారం, వెండి : అంతర్జాతీయ మార్కెట్లో ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయంగానూ పసి డి, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9ు స్వచ్ఛత బంగారం 10 గ్రాములు రూ.3,500 ఎగబాకి రూ.1,28,900కు చేరింది. 99.5ు స్వచ్ఛత లోహం కూడా అదే స్థాయిలో పెరిగి రూ.1,28,300 పలికింది. కిలో వెండి సైతం ఒక్కరోజే రూ.5,800 పెరుగుదలతో రూ.1,60,800 స్థాయికి చేరుకుంది.
ఇవీ చదవండి:
డిసెంబర్‌లో బ్యాంక్ హాలిడేస్ ఇవే.. ప్లాన్ చేస్కోండి.!
మీ చిన్నారులకు పాన్ కార్డ్ తీసుకోండి.. ఇన్వెస్ట్‌మెంట్‌పై అవగాహన కల్పించండి!