Stock Market Gains: పడి లేచిన మార్కెట్
ABN , Publish Date - Nov 12 , 2025 | 04:53 AM
దేశీయ స్టాక్ మార్కెట్‌లో మంగళవారం సైతం లాభాలు కొనసాగాయి. సెన్సెక్స్ 335.97 పాయింట్ల లాభంతో 83,871.32 వద్ద ముగియగా, నిఫ్టీ 120.60 పాయింట్ల లాభంతో...
సెన్సెక్స్ 336 పాయింట్లు అప్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్‌లో మంగళవారం సైతం లాభాలు కొనసాగాయి. సెన్సెక్స్ 335.97 పాయింట్ల లాభంతో 83,871.32 వద్ద ముగియగా, నిఫ్టీ 120.60 పాయింట్ల లాభంతో 25,694.95 వద్ద ముగిసింది. ఉదయం అమ్మకాలతో ఒక దశలో సెన్సెక్స్ 411.32 పాయింట్లు, నిఫ్టీ 125.1 పాయింట్ల వరకు నష్టపోయాయి. ఆ సమయంలో తక్కువ ధరలో లభిస్తున్న ఐటీ, సర్వీసెస్, టెలికం షేర్ల కోసం మదుపరులు ఎగబడడంతో సూచీలు లాభాల బాట పట్టాయి. మార్కెట్ లాభాల బాట పట్టడానికి ఐటీ, ఆటో, మెటల్, ఎఫ్‌ఎంసీజీ కంపెనీల షేర్లు ప్రధానంగా దోహదం చేశాయని నిపుణులంటున్నారు.
ఇవి కూడా చదవండి:
పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..
లాభాలతో ప్రారంభమై నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..