Stock Market Rally: మార్కెట్లలో కొనసాగిన ర్యాలీ
ABN , Publish Date - Sep 13 , 2025 | 03:01 AM
అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న ఆశలతో పాటు ఇన్ఫోసిస్ ప్రకటించిన భారీ బైబ్యాక్ ఉత్తేజంతో శుక్రవారం కూడా ఈక్విటీ మార్కెట్లో ర్యాలీ కొనసాగింది. వరుసగా సెన్సెక్స్ ఐదో రోజు, నిఫ్టీ ఎనిమిదో రోజు లాభాల్లో...
ఇటు ఈక్విటీలు, అటు బులియన్ పరుగులు
ముంబై: అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న ఆశలతో పాటు ఇన్ఫోసిస్ ప్రకటించిన భారీ బైబ్యాక్ ఉత్తేజంతో శుక్రవారం కూడా ఈక్విటీ మార్కెట్లో ర్యాలీ కొనసాగింది. వరుసగా సెన్సెక్స్ ఐదో రోజు, నిఫ్టీ ఎనిమిదో రోజు లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 444.12 పాయింట్లు లాభంతో 81,992.85 పాయింట్లను తాకిన సెన్సెక్స్ చివరికి 355.97 పాయింట్ల లాభంతో 81,904.70 వద్ద ముగిసింది. నిఫ్టీ 108.50 పాయింట్ల లాభంతో 25,114 వద్ద ముగిసింది. వారం మొత్తంలో సెన్సెక్స్ 1193.94 పాయింట్లు, నిఫ్టీ 373 పాయింట్లు లాభపడ్డాయి. వరుసగా 8 సెషన్లలో నిఫ్టీ 534 పాయింట్లు లాభపడింది.
బంగారం, వెండి భగభగ
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల ర్యాలీ కూడా అప్రతిహతంగా కొనసాగుతోంది. ఢిల్లీ మార్కెట్లో 99.9ు స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి మరో జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.1,13,800 వద్ద ముగిసింది. 99.5ు స్వచ్ఛత గల బంగారం ధర సైతం రూ.700 పెరిగి రూ.1,13,300 వద్ద స్థిరపడింది. రెండు రోజుల నష్టాలకు తెర దించిన వెండి ధర బలమైన పునరుజ్జీవం సాధించింది. కిలో వెండి రూ.4,000 పెరిగి జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.1,32,000 వద్ద స్థిరపడింది.
ఇవి కూడా చదవండి
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్... నామినీగా మహ్మద్ సిరాజ్
ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి