Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే
ABN , Publish Date - Jun 05 , 2025 | 10:49 AM
బుధవారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు గురువారం కూడా అదే ధోరణిలో కదలాడుతున్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల నేపథ్యంలో గురువారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సూచీలు, హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా లాభాల్లోకి వచ్చాయి.
బుధవారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు గురువారం కూడా అదే ధోరణిలో కదలాడుతున్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల నేపథ్యంలో గురువారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సూచీలు, హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా లాభాల్లోకి వచ్చాయి. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడం కూడా కలిసి వచ్చింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో పయనిస్తున్నాయి. (Business News).
బుధవారం ముగింపు (80, 998)తో పోల్చుకుంటే గురువారం ఉదయం 190 పాయింట్లతో మొదలైన సెన్సెక్స్ కాసేపు లాభనష్టాలతో దోబూచులాడింది. ఆ తర్వాత లాభాల్లోకి ప్రవేశించింది. ఒక దశలో 460 పాయింట్లకు పైగా లాభపడింది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో 316 పాయింట్ల లాభంతో 81, 315 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 97 పాయింట్ల లాభంతో 24, 718 వద్ద కదలాడుతోంది. అమెరికా మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఆసియా మార్కెట్లు ప్రస్తుతం మిశ్రమంగా కదలాడుతున్నాయి.
సెన్సెక్స్‌లో ఎటర్నల్, ఎస్‌జేవీఎన్, యూనో మిండా, గ్లెన్‌మార్క్ షేర్లు లాభాల్లో ముగిశాయి. హడ్కో, ఐఈఎక్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 281 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 51 పాయింట్లు లాభపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.91గా ఉంది.
ఇవి కూడా చదవండి..
అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్‌కు రూ 6400 కోట్ల నిధులు
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..