Share News

Stock Market: ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్న దేశీయ సూచీలు.. టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

ABN , Publish Date - Jun 16 , 2025 | 10:02 AM

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల్లో పెరుగుదల కారణంగా స్టాక్ మార్కెట్లు గత శుక్రవారం భారీ నష్టాలను చవిచూశాయి. అయితే ఈ వారాన్ని మాత్రం కాస్త సానుకూలంగా ప్రారంభించాయి.

Stock Market: ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్న దేశీయ సూచీలు.. టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
Stock Market

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల్లో పెరుగుదల కారణంగా స్టాక్ మార్కెట్లు గత శుక్రవారం భారీ నష్టాలను చవిచూశాయి. అయితే ఈ వారాన్ని మాత్రం కాస్త సానుకూలంగా ప్రారంభించాయి. ద్రవ్యోల్బణం తగ్గడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను అరశాతం మేర తగ్గించడం, సాధారణానికి మించి వర్షపాతం నమోదవుతుందనే అంచనాల కారణంగా మార్కెట్లలో పాజిటివ్ సెంటిమెంట్ నెలకొంది. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. (Business News).


గత శుక్రవారం ముగింపు (81, 118)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి దూసుకెళ్లింది. ఒక దశలో ఏకంగా 300 పాయింట్లకు పైగా లాభపడి 81, 409 వద్ద గరిష్టాన్ని తాకింది. అయితే ప్రస్తుతం మళ్లీ కిందకు దిగి వచ్చింది. ప్రస్తుతం ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 46 పాయింట్ల లాభంతో 81, 170 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 14 పాయింట్ల లాభంతో 24, 732 వద్ద రోజును ముగించింది.


సెన్సెక్స్‌లో పీఐ ఇండస్ట్రీస్, ఆయిల్ ఇండియా, సిప్లా, ఎమ్‌సీఎక్స్ ఇండెక్స్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్, టాటా టెక్నాలజీస్, మేజగాన్ డాక్, హెచ్‌ఎఫ్‌సీఎల్ షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 482 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 113 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 86.12గా ఉంది.


ఇవీ చదవండి:

Gold and Silver Rates Today: స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Adani Ports: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు.. హైఫా పోర్టుకు ఎలాంటి నష్టమూ జరగలేదన్న అదానీ గ్రూప్

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 16 , 2025 | 10:02 AM