Stock Market: కొనసాగుతున్న నష్టాలు.. ఈరోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Jul 02 , 2025 | 04:09 PM
సోమవారం నష్టాలను చవిచూసిన సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఈ రోజు మళ్లీ నష్టాల బాట పట్టాయి. ఉదయం స్వల్ప లాభాల్లో మొదలైన సూచీలు మధ్యాహ్నం తర్వాత నష్టాల బాట పట్టాయి. చివరకు సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లోనే రోజును ముగించాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు, గరిష్టాల వద్ద మదుపర్లు అమ్మకాలకు పాల్పడుతుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల కొనసాగాయి. సోమవారం నష్టాలను చవిచూసిన సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఈ రోజు మళ్లీ నష్టాల బాట పట్టాయి. ఉదయం స్వల్ప లాభాల్లో మొదలైన సూచీలు మధ్యాహ్నం తర్వాత నష్టాల బాట పట్టాయి. చివరకు సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లోనే రోజును ముగించాయి. (Business News).
మంగళవారం ముగింపు (83, 697)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మధ్యాహ్నం వరకు లాభనష్టాలతో దోబూచులాడాయి. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాల బాట పట్టాయి. చివరకు నష్టాలతోనే రోజును ముగించాయి. సెన్సెక్స్ 287 పాయింట్ల నష్టంతో 83, 409 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే నడించింది. చివరకు 88 పాయింట్ల నష్టంతో 24, 453 వద్ద రోజును ముగించింది. మళ్లీ 24, 500 మార్క్ దిగువకు పడిపోయింది.
సెన్సెక్స్‌లో టాటా కమ్యూనికేషన్స్, ఆదిత్యా బిర్లా ఫ్యాషన్స్, మ్యాన్‌కైండ్ ఫార్మా, టాటా స్టీల్స్ షేర్లు లాభాలు ఆర్జించాయి. ఆర్బీఎల్ బ్యాంక్, ఎన్‌సీసీ, ఫియోనిక్స్ మిల్స్, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 82 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 460 పాయింట్లు నష్టపోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.70గా ఉంది.
ఇవి కూడా చదవండి
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన 5 కీలక మార్పుల గురించి తెలుసా మీకు..
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి