Stock Market: చివర్లో అమ్మకాల ఒత్తిడి.. ఈరోజు టాప్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Jul 03 , 2025 | 04:11 PM
అమెరికా-భారత్ మధ్య ట్రేడ్ డీల్ కుదరవచ్చు అనే అంచనాలతో సూచీలు రోజంతా లాభాల్లో కదలాడాయి. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో లాభాలను కోల్పోయి నష్టాలతో రోజును ముగించాయి. ఉదయం భారీ లాభాల్లో కదలాడిన సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతోనే రోజును ముగించాయి.
రోజంతా లాభాల్లో కొనసాగిన సూచీలు చివర్లో అమ్మకాల ఒత్తడిని ఎదర్కొన్నాయి. చివరకు నష్టాలతో రోజును ముగించాయి. అమెరికా-భారత్ మధ్య ట్రేడ్ డీల్ కుదరవచ్చు అనే అంచనాలతో సూచీలు రోజంతా లాభాల్లో కదలాడాయి. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో లాభాలను కోల్పోయి నష్టాలతో రోజును ముగించాయి. ఉదయం భారీ లాభాల్లో కదలాడిన సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతోనే రోజును ముగించాయి. (Business News).
బుధవారం ముగింపు (83, 409)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 140 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ మధ్యాహ్నం వరకు లాభాల్లో కదలాడింది. ఒక దశలో 450 పాయింట్లకు పైగా లాభపడి 83, 850 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో ఇంట్రాడే గరిష్టం నుంచి 700 పాయింట్లకు పైగా కోల్పోయి 83, 186 వద్ద కనిష్టానికి చేరింది. చివరకు సెన్సెక్స్ 170 పాయింట్ల నష్టంతో 83, 239 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే నడించింది. చివరకు 48 పాయింట్ల నష్టంతో 25, 405 వద్ద రోజును ముగించింది.
సెన్సెక్స్‌లో బాష్, బ్లూస్టార్, 360 వాన్ వ్యామ్, ఆయిల్ ఇండియా, ఛంబల్ ఫెర్టిలైజర్స్ షేర్లు లాభాలు ఆర్జించాయి. నైకా, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, పీఎన్‌బీ, ఐసీఐసీఐ ప్రుడెన్సియల్, వేదాంత షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 16 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 207 పాయింట్లు నష్టపోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.31గా ఉంది.
ఇవి కూడా చదవండి
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి