Stock Market: వారాంతంలో తప్పని నష్టాలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే
ABN , Publish Date - May 30 , 2025 | 04:17 PM
గురువారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు ఈ వారానికి నష్టాలతోనే టాటా చెప్పాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలతో పాటు ప్రధాన షేర్లలో అమ్మకాలు దేశీయ సూచీలను నష్టాల బాట పట్టించాయి.
గురువారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు ఈ వారానికి నష్టాలతోనే టాటా చెప్పాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలతో పాటు ప్రధాన షేర్లలో అమ్మకాలు దేశీయ సూచీలను నష్టాల బాట పట్టించాయి. ముఖ్యంగా ఆటో, ఐటీ, మెటల్ షేర్లలో విక్రయాలు సూచీలను కిందకు లాగాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ ఈ రోజు నష్టాలను చవిచూశాయి (Business News).
గురువారం ముగింపు (81, 633)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 200 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఉదయం కాసేపు లాభనష్టాలతో దోబూచులాడింది. ఆ తర్వాత ప్రధాన షేర్లలో అమ్మకాలు మొదలు కావడంతో నష్టాల బాట పట్టాయి. ఒకదశలో 81, 451 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. చివరకు సెన్సెక్స్ 182 పాయింట్ల నష్టంతో 81, 451 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 82 పాయింట్ల నష్టంతో 24, 750 వద్ద రోజును ముగించింది.
సెన్సెక్స్‌లో ఎస్బీఐ, ఎటర్నల్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫిన్‌సెర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, సన్‌ఫార్మా, టాటా స్టీల్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 37 పాయింట్ల నష్టంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 203 పాయింట్లు లాభపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.57గా ఉంది.
ఇవీ చదవండి:
నెలకు రూ.25000 జీతం వచ్చినా పర్లేదు.. ఇందులో సేవ్ చేస్తే కొన్నేళ్లలోనే రూ.2.73 కోట్ల పైన రిటర్న్స్?
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి