Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. ఈ రోజు ఇవే టాప్ స్టాక్స్
ABN , Publish Date - Jun 03 , 2025 | 04:33 PM
గరిష్టాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో మంగళవారం దేశీయ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో మంగళవారం ఉదయం స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి.
ఆర్బీఐ ద్రవ్యపరపతి సమావేశం ఫలితాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. గరిష్టాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో మంగళవారం దేశీయ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో మంగళవారం ఉదయం స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. అయితే ఐటీ, ఫైనాన్సియల్ షేర్లలో అమ్మకాలు సూచీలను కిందకు లాగాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఒకదశలో ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. (Business News).
సోమవారం ముగింపు (81, 373)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 100 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కాసేపు లాభాల్లోనే కదలాడింది. ఒకదశలో 400 పాయింట్లకు పైగా ఎగబాకి 81, 774 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మొదలు కావడంతో సూచీలు నష్టపోయాయి. ఇంట్రాడే హై నుంచి ఏకంగా 1200కు పైగా కోల్పోయి 80, 575 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. చివరకు సెన్సెక్స్ 636 పాయింట్ల నష్టంతో 80, 737 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 174 పాయింట్ల నష్టంతో 24, 542 వద్ద రోజును ముగించింది.
సెన్సెక్స్‌లో హిందుస్తాన్ జింక్, జిందాల్ స్టైయిన్ లెస్ స్టీల్, ప్రెస్టీజ్ ఎస్టేట్, బీఎస్‌ఈ లిమిటెడ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. యస్ బ్యాంక్, వోడాఫోన్ ఐడియా, ఐసీఐసీఐ ప్రుడెన్సియల్, భెల్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 258 పాయింట్ల నష్టంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 303 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.59గా ఉంది.
ఇవీ చదవండి:
ప్రజల వద్ద ఉన్న రూ.2000 నోట్లను తిరిగి తీసుకుంటాం..
జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి