Share News

Stock Market: భారీ నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే

ABN , Publish Date - Jun 02 , 2025 | 03:51 PM

దేశ జీడీపీ స్థిరంగా కొనసాగుతుండడం, డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి బలపడుతుండడం, ఆర్బీఐ ద్రవ్యపరపతి సమావేశం ఫలితాల నేపథ్యంలో సోమవారం దేశీయ సూచీలు అప్రమత్తంగా కదలాడాయి. ఉదయం భారీ నష్టాల్లో కదలాడిన సూచీలు మధ్యాహ్నం తర్వాత కోలుకున్నాయి.

Stock Market: భారీ నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే
Stock Market

దేశ జీడీపీ స్థిరంగా కొనసాగుతుండడం, డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి బలపడుతుండడం, ఆర్బీఐ ద్రవ్యపరపతి సమావేశం ఫలితాల నేపథ్యంలో సోమవారం దేశీయ సూచీలు అప్రమత్తంగా కదలాడాయి. ఉదయం భారీ నష్టాల్లో కూరుకుపోయిన సూచీలు మధ్యాహ్నం తర్వాత కోలుకున్నాయి. ఇంట్రాడే లోతో పోల్చుకుంటే సెన్సెక్స్ 600 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ మళ్లీ 24,700 మార్క్‌ను నిలబెట్టుకుంది. అయితే ప్రధాన సూచీలు మాత్రం స్వల్ప నష్టాలతోనే రోజును ముగించాయి (Business News).


గత శుక్రవారం ముగింపు (81, 451)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో ఏకంగా 700 పాయింట్లకు పైగా కోల్పోయి 80, 654 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మొదలు కావడంతో సూచీలు కోలుకున్నాయి. ఓ దశలో లాభాల్లోకి వచ్చాయి. చివరకు సెన్సెక్స్ 77 పాయింట్ల నష్టంతో 81, 373 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 34 పాయింట్ల నష్టంతో 24, 716 వద్ద రోజును ముగించింది.


సెన్సెక్స్‌లో సీడీఎస్‌ఎల్, ఎస్ బ్యాంక్, ప్రెస్టిజ్ ఎస్టేట్, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఐనాక్స్ విండ్, నైకా, మాజగాన్ డాక్, కేన్స్ టెక్నాలజీ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 355 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 153 పాయింట్లు లాభపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.38గా ఉంది.


ఇవీ చదవండి:

జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..

జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 04:22 PM