Stock Market: అమెరికా వడ్డీ రేట్లు యధాతథం.. వరుసగా మూడో రోజూ లాభాలే..
ABN , Publish Date - Jan 30 , 2025 | 04:01 PM
అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను యధాతథంగానే కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు శనివారం నాడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలు కాస్త ఒడిదుడుకులకు లోనయ్యాయి. రోజంతా లాభనష్టాలతో దోబూచులాడాయి.

అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను యధాతథంగానే కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు శనివారం నాడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలు కాస్త ఒడిదుడుకులకు లోనయ్యాయి. రోజంతా లాభనష్టాలతో దోబూచులాడాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు మాత్రం ఫ్లాట్‌గా క్లోజ్ అయ్యాయి. చివరకు మాత్రం సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతోనే రోజును ముగించాయి. వరుసగా మూడో రోజు కూడా సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతోనే రోజును ముగించాయి. (Business News)
బుధవారం ముగింపు (76, 532)తో పోల్చుకుంటే గురువారం ఉదయం 65 పాయింట్ల స్వల్ప లాభంతో మొదలైన సెన్సెక్స్ ఉదయమంతా ఒడిదుడుకుల్లోనే కొనసాగింది. లాభనష్టాలతో దోబూచులాడింది. మధ్యాహ్నం సమయంలో 400 పాయింట్లకు పైగా లాభపడి 76,962 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మొదలయ్యాయి. దీంతో నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడే గరిష్టం నుంచి ఏకంగా 500 పాయిట్లు కోల్పోయి 76, 401 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. చివరకు సెన్సెక్స్ 226 పాయింట్ల లాభంతో 76, 759 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 86 పాయింట్ల లాభంతో 23, 249 వద్ద రోజును ముగించింది.
సెన్సెక్స్‌లో లారస్ ల్యాబ్స్, ఎస్‌ఆర్‌ఎఫ్, గ్రాన్యుయల్స్ ఇండియా, కేపీఐటీ టెక్నాలజీస్ షేర్లు లాభాలను ఆర్జించాయి. వోల్టాస్, కామ్స్, టాటా మోటార్స్, ఏబీబీ ఇండియా షేర్లు భారీగా నష్టపోయాయి. బీఎస్‌ఈ స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ 146 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.63గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..