Share News

Stock Market: మార్కెట్లకు ప్రీ బడ్జెట్ బూస్ట్.. వరుసగా నాలుగో రోజూ లాభాలే..

ABN , Publish Date - Jan 31 , 2025 | 04:00 PM

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, శనివారం కేంద్ర మంత్రి ప్రవేశపెట్టనున్న బడ్జెట్ నేపథ్యంలో శుక్రవారం స్టాక్ మార్కెట్లు జోరు చూపించాయి. వరుసగా నాలుగో రోజూ లాభాలను ఆర్జించాయి. గత వారం భారీగా నష్టపోయిన బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు ఈ వారం బాగా లాభపడ్డాయి.

Stock Market: మార్కెట్లకు ప్రీ బడ్జెట్ బూస్ట్.. వరుసగా నాలుగో రోజూ లాభాలే..
Stock Market

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, శనివారం కేంద్ర మంత్రి ప్రవేశపెట్టనున్న బడ్జెట్ నేపథ్యంలో శుక్రవారం స్టాక్ మార్కెట్లు జోరు చూపించాయి. వరుసగా నాలుగో రోజూ లాభాలను ఆర్జించాయి. గత వారం భారీగా నష్టపోయిన బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు ఈ వారం బాగా లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ వంటి హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లు కూడా మార్కెట్లకు కలిసి వచ్చాయి. దీంతో సెన్సెక్స్ 77, 500, నిఫ్టీ 23, 500కు పైన స్థిరపడ్డాయి (Business News)


గురువారం ముగింపు (76, 759)తో పోల్చుకుంటే శుక్రవారం ఉదయం 100 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లు పెరగడంతో సెన్సెక్స్ మరింత పైకి ఎగబాకింది. ఒకదశలో దాదాపు 850 పాయింట్లు లాభపడి 77, 605 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. చివరకు సెన్సెక్స్ 740 పాయింట్ల లాభంతో 77, 500 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 258 పాయింట్ల లాభంతో 23, 508 వద్ద రోజును ముగించింది. చాలా రోజుల తర్వాత 23,500కు పైన రోజును ముగించింది.


సెన్సెక్స్‌లో కల్యాణ్ జ్యువెల్లర్స్, ఎన్‌బీసీసీ, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, సైయింట్ షేర్లు లాభాలను ఆర్జించాయి. జిందాల్ స్టీల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, దివీస్ ల్యాబ్స్, టొరెంట్ ఫార్మ షేర్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 997 పాయింట్ల లాభంతో ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 275 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.61గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jan 31 , 2025 | 04:01 PM