Stock Market: మూడో రోజూ లాభాలే.. 77 వేల మార్క్ దాటిన సెన్సెక్స్..
ABN , Publish Date - Jan 16 , 2025 | 03:56 PM
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్టానికి దిగిరావడంతో పాటు మదుపర్లు కొనుగోళ్లపై దృష్టి పెట్టడంతో సూచీలు వరుస లాభాలను అందుకుంటున్నాయి. ఈ వారంలో తొలి రోజైన సోమవారం భారీ నష్టాలు చవిచూసిన స్టాక్ మార్కెట్లు మంగళవారం నుంచి లాభాల బాట పట్టాయి.

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్టానికి దిగిరావడంతో పాటు మదుపర్లు కొనుగోళ్లపై దృష్టి పెట్టడంతో సూచీలు వరుస లాభాలను అందుకుంటున్నాయి. ఈ వారంలో తొలి రోజైన సోమవారం భారీ నష్టాలు చవిచూసిన స్టాక్ మార్కెట్లు మంగళవారం నుంచి లాభాల బాట పట్టాయి. ఈ రోజు (గురువారం) కూడా లాభాల్లోనే కదలాడాయి. ఇండెక్స్‌లో హెవీ వెయిట్ షేర్లు లాభపడుతుండడం సూచీలపై సానుకూల ప్రభావం చూపిస్తోంది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల బాటలో సాగుతున్నాయి (Business News).
బుధవారం ముగింపు (76, 724)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 600 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. 77, 319 వద్ద గరిష్టానికి చేరుకుంది. ఆ తర్వాత కొద్దిగా దిగి వచ్చినప్పటికీ లాభాల్లోనే కొనసాగింది. చివరకు 318 పాయింట్ల లాభంతో 77, 042 వద్ద రోజును ముగించింది. మళ్లీ 77 వేల మార్క్‌ను దాటింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే లాభాలతో రోజును ప్రారంభించింది. చివరకు 98 పాయింట్ల లాభంతో 23, 311 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్‌లో ఎల్ అండీ టీ టెక్నాలజీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హెచ్‌ఎఫ్‌సీఎల్, ఇండియన్ బ్యాంక్ షేర్లు లాభాలు అందుకున్నాయి. ఒరాకిల్ ఫిన్‌సెర్వ్, కల్యాణ్ జువెల్లర్, ట్రెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు నష్టాలను మూట్టగట్టుకున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 584 పాయింట్ల లాభం ఆర్జించింది. బ్యాంక్ నిఫ్టీ 527 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.55గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..