Share News

Stock Market: భారీ నష్టాల నుంచి కోలుకుని.. స్వల్ప నష్టాలతో ముగిసి..

ABN , Publish Date - Feb 12 , 2025 | 04:09 PM

స్టీల్, అల్యూమినియంతో పాటు ఇతర ఉత్పత్తులపై కూడా దిగుమతి సుంకం విధించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొగ్గు చూపుతుండడం, విదేశీ మదుపర్లు భారీగా అమ్మకాలకు దిగడం స్టాక్‌మార్కెట్ల సెంటిమెంట్‌ను దారుణంగా దెబ్బతీస్తున్నాయి.

Stock Market: భారీ నష్టాల నుంచి కోలుకుని.. స్వల్ప నష్టాలతో ముగిసి..
Stock Market

వివిధ దేశాలతో అమెరికా వాణిజ్య యుద్ధాల కారణంగా, అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. స్టీల్, అల్యూమినియంతో పాటు ఇతర ఉత్పత్తులపై కూడా దిగుమతి సుంకం విధించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొగ్గు చూపుతుండడం, విదేశీ మదుపర్లు భారీగా అమ్మకాలకు దిగడం స్టాక్‌మార్కెట్ల సెంటిమెంట్‌ను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. మంగళవారం భారీ నష్టాలను చవిచూసిన సూచీలు బుధవారం ఉదయం కూడా అదే ధోరణిలో కొనసాగాయి. మధ్యాహ్నం తర్వాత కోలుకున్నాయి. (Business News)


మంగళవారం ముగింపు (76, 293)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం వంద పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత క్రమంగా నష్టాల్తోకి జారుకుంది. ఒక దశలో 950 పాయింట్లకు పైగా కోల్పోయి 75, 388 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పడిపోయింది. అయితే మధ్యాహ్నం తర్వాత కోలుకుంది. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లు సాగించడంతో ఇంట్రాడే కనిష్టం నుంచి 1100 పాయింట్లు పైకి వచ్చింది. చివరకు 122 పాయింట్ల నష్టంతో 76, 171 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. ఉదయం 22, 800 కంటే కింద పడిపోయి ఆ తర్వాత కోలుకుంది. చివరకు 26 పాయింట్ల నష్టంతో 23, 045 వద్ద స్థిరపడింది.


సెన్సెక్స్‌లో ఏంజెల్ వన్, కామ్స్, సెయిల్, నాల్కో షేర్లు లాభాలను ఆర్జించాయి. ప్రెస్టేజ్ ఎస్టేట్, వొడాఫోన్ ఐడియా, గోద్రేజ్ ప్రాపర్టీస్, డీఎల్‌ఎఫ్ షేర్లు నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 131 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ 76 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 86.89గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 12 , 2025 | 04:09 PM