Stock Market: బేర్ పట్టు నుంచి కాస్త బ్రేక్.. స్వల్ప లాభాలు ఆర్జించిన స్టాక్ మార్కెట్లు..
ABN , Publish Date - Feb 17 , 2025 | 04:05 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు వాణిజ్య యుద్ధాలకు కారణమవుతానే భయంతో ప్రపంచ మార్కెట్లు వరుస నష్టాలను ఎదుర్కొంటున్నాయి. దేశీయ సూచీలు వరుసగా ఎనిమిది రోజులు భారీ నష్టాలను చవిచూశాయి. సోమవారం ఉదయం కూడా స్టాక్ మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు వాణిజ్య యుద్ధాలకు కారణమవుతానే భయంతో ప్రపంచ మార్కెట్లు వరుస నష్టాలను ఎదుర్కొంటున్నాయి. వరుసగా ఎనిమిది రోజులు భారీ నష్టాలతో నేల చూపులు చేసిన దేశీయ సూచీలు సోమవారం కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. సోమవారం ఉదయం కూడా స్టాక్ మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. అయితే చివర్లో నష్టాల నుంచి బయటపడి లాభాలతో రోజును ముగించాయి. ముఖ్యంగా భారీ నష్టాలను చవిచూస్తున్న మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ కాస్త కోలుకున్నాయి. (Business News)
గత శుక్రవారం ముగింపు (75, 939)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 300 పాయింట్లు నష్టంతో రోజును ప్రారంభించిన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో 600 పాయింట్లకు పైగా కోల్పోయి 75, 294 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పడిపోయింది. అయితే మధ్యాహ్నం తర్వాత కాస్త కోలుకుంది. చివరకు 57 పాయింట్ల స్వల్ప లాభంతో 75, 996 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. ఉదయం 22, 750 కంటే కింద పడిపోయి ఆ తర్వాత కోలుకుంది. చివరకు 30 పాయింట్ల స్వల్ప లాభంతో 22, 959 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్‌లో మనప్పురం ఫైనాన్స్, సీజీ పవర్, అశోక్ లేలాండ్, ఆస్ట్రాల్ లిమిటెడ్ షేర్లు లాభాలను ఆర్జించాయి. పీబీ ఫిన్‌టెక్, మహీంద్రా అండ్ మహీంద్రా, సుప్రీమ్ ఇండస్ట్రీస్, వరుణ్ బేవరేజెస్ షేర్లు నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 195 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 159 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 86.88గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..