Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Mar 07 , 2025 | 04:02 PM
అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలత కారణంగా ఆసియా మార్కెట్లు నేడు ఫ్లాట్‌గా ముగిశాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ కూడా అదే బాటలో కదలాడాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు గురువారం ఏకంగా రూ. 2,377 కోట్లు విలువైన షేర్లను అమ్మేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.1,618 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

బుధ, గురువారాలు లాభాలు కళ్ల జూసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని ఫ్లాట్‌గా ముగించాయి. వారం చివర్లో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు లాభనష్టాతో దోబూచులాడాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలత కారణంగా ఆసియా మార్కెట్లు నేడు ఫ్లాట్‌గా ముగిశాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ కూడా అదే బాటలో కదలాడాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు గురువారం ఏకంగా రూ. 2,377 కోట్లు విలువైన షేర్లను అమ్మేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.1,618 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. (Business News).
గురువారం ముగింపు (74, 340)తో పోల్చుకుంటే శుక్రవారం ఉదయం ఫ్లాట్‌గా రోజును ప్రారంభించిన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి దూసుకెళ్లింది. ఒక దశలో దాదాపు 200 పాయింట్లకు పైగా పెరిగి 74, 586 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత మదుపర్లు అమ్మకాలకు దిగారు. దీంతో చివరకు సెన్సెక్స్ 7.5 పాయింట్ల స్వల్ప నష్టంతో 74, 332 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 7.8 పాయింట్ల స్వల్ప లాభంతో 22, 552 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్‌లో టిటాఘర్, రిలయన్స్, ఎస్‌ఆర్‌ఎఫ్, అపోలో టైర్స్ షేర్లు లాభాలను ఆర్జించాయి. కల్యాణ్ జువెల్లర్స్, మహానగర్ గ్యాస్, జొమాటో, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 157 పాయింట్లు కోల్పోయి. బ్యాంక్ నిఫ్టీ 130 పాయింట్ల నష్టంతో రోజును ముగించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 86.87 గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..