Stock Market: బడ్జెట్ ఎఫెక్ట్.. ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ సూచీలు..
ABN , Publish Date - Feb 01 , 2025 | 04:21 PM
రోజంతా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న దేశీయ సూచీలు చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కారణంగా స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. రోజంతా లాభ, నష్టాలతో దోబూచులాడి చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి.
రోజంతా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న దేశీయ సూచీలు చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కారణంగా స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. రోజంతా లాభ, నష్టాలతో దోబూచులాడి చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నష్టాల బాట పట్టాయి. ఆ తర్వాత మళ్లీ తేరుకున్నాయి. (Business News)
శుక్రవారం ముగింపు (77, 500)తో పోల్చుకుంటే శనివారం ఉదయం 100 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభమయ్యే వరకు లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో దాదాపు 400 పాయింట్లు లాభపడి 77, 899 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. అయితే బడ్జెట్ ప్రసంగం మొదలైన కొద్ది సేపటికి నష్టాల్లోకి జారుకుంది. గరిష్టం నుంచి ఏకంగా దాదాపు 900 పాయింట్లు కోల్పోయి 77, 006 వద్దకు చేరింది. ఆ తర్వాత కోలుకుంది. చివరకు 5 పాయింట్ల స్వల్ప లాభంతో 77, 505 వద్ద ముగిసింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 26 పాయింట్ల నష్టంతో 23, 482 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్‌లో అవెన్యూ సూపర్ మార్కెట్, హెచ్‌ఎఫ్‌సీఎల్, సీజీ కన్స్యూమర్, ట్రెంట్ షేర్లు లాభాలు ఆర్జించాయి. . ఎన్‌సీసీ, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఐఆర్‌ఎఫ్‌సీ, ఏబీబీ ఇండియా షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 226 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 80 పాయింట్ల నష్టంతో రోజును ముగించింది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..