నెల గరిష్ఠానికి సూచీలు
ABN , Publish Date - Feb 05 , 2025 | 05:57 AM
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో దాదాపు 2 శాతం మేర వృద్ధి చెంది నెల రోజుల గరిష్ఠ స్థాయికి ఎగబాకాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.....
సెన్సెక్స్ 1,397 పాయింట్లు అప్
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో దాదాపు 2 శాతం మేర వృద్ధి చెంది నెల రోజుల గరిష్ఠ స్థాయికి ఎగబాకాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మెక్సికో, కెనడాపై విధించిన సుంకాల అమలును నెల రోజులు వాయిదా వేయడంతో ఆసియా మార్కెట్లతో పాటు మన సూచీలూ ర్యాలీ తీశాయి. సెన్సెక్స్ 1,397.07 పాయింట్లు (1.81 శాతం) బలపడి 78,583.81 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 378.20 పాయింట్లు (1.62 శాతం) పెరిగి 23,739.25 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది జనవరి 3 తర్వాత సూచీలకిదే గరిష్ఠ ముగింపు స్థాయి. కాగా, ఈక్విటీ మదుపరుల సంపదగా పరిగణించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.95 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ. 425.50 లక్షల కోట్లకు (4.88 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది.
ఇవి కూడా చదవండి:
Ratan Tata: రతన్ టాటా యంగ్ ఫ్రెండ్ శంతను నాయుడికి టాటా మోటార్స్‌లో కీలక పదవి
8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News