Share News

Indian Stock Market: మూడో రోజూ నష్టాల్లో మార్కెట్‌

ABN , Publish Date - Dec 18 , 2025 | 06:40 AM

అమ్మకాల జోరుతో స్టాక్‌ మార్కెట్‌ వరుసగా మూడో రోజూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 120.21 పాయింట్ల నష్టంతో 84,559.65 వద్ద ముగియగా...

Indian Stock Market: మూడో రోజూ నష్టాల్లో మార్కెట్‌

ముంబై: అమ్మకాల జోరుతో స్టాక్‌ మార్కెట్‌ వరుసగా మూడో రోజూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 120.21 పాయింట్ల నష్టంతో 84,559.65 వద్ద ముగియగా, నిఫ్టీ 41.55 పాయింట్ల నష్టంతో 25,818.55 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ ఒక దశలో 263.88 పాయింట్లు నష్టపోయి 84,415.98 పాయింట్ల ఇంట్రా డే కనిష్ఠ స్థాయిని తాకిన సమయంలో ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంకు, ఇన్ఫోసిస్‌, మారు తి సుజుకీ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో కొద్ది గా కోలుకుంది. అయినా హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బీఈఎల్‌, టైటాన్‌, ఏసియన్‌ పెయింట్స్‌ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి బుధవారం సూచీలను నష్టాలవైపు నడిపించాయి.

నెఫ్రోకేర్‌ షేర్ల శుభారంభం: హైదరాబాద్‌ కేంద్రంగా డయాలసిస్‌ సేవలందించే నెఫ్రోకేర్‌ హెల్త్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ షేర్లు లిస్టింగ్‌లో శుభారాంభాన్నిచ్చాయి. ఇష్యూ ధర రూ.460 కాగా ఈ కంపెనీ షేర్లు బీఎ్‌సఈలో 6.89ు లాభంతో రూ.491.70 వద్ద లిస్టయ్యాయి. ఇంట్రాడేలో 8.41ు లాభంతో రూ.498.70కి చేరినప్పటికీ ఈ షేరు చివరికి 2.52ు లాభంతో రూ.471.60 వద్ద ముగిసింది.

ఇవీ చదవండి:

జీవితకాల కనిష్ఠ స్థాయికి చేరిన రూపాయి

యశోద హాస్పిటల్స్‌, ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ పబ్లిక్‌ ఇష్యూలకు సెబీ ఓకే

Updated Date - Dec 18 , 2025 | 06:40 AM