Sensex Climbs 136 Points: నాలుగో రోజూ మార్కెట్ ముందుకే
ABN , Publish Date - Oct 08 , 2025 | 05:59 AM
స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లతో మంగళవారం సెన్సెక్స్ 136.63 పాయింట్లు పెరిగి...
సెన్సెక్స్ 136 పాయింట్లు అప్
ముంబై: స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లతో మంగళవారం సెన్సెక్స్ 136.63 పాయింట్లు పెరిగి 81,926.75 వద్ద స్థిరపడింది. ఒక దశలో సూచీ 519.44 పాయింట్లు ఎగబాకి 82,309.56 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఆఖరి గంటలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడటంతో సూచీ మళ్లీ కాస్త జారుకుంది. నిఫ్టీ 30.65 పాయింట్ల వృద్ధితో 25,108.30 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 13 మాత్రమే రాణించాయి. ఫారెక్స్ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు తగ్గి 88.77 వద్ద ముగిసింది.
ఐపీఓకు సాయి పేరెంటరల్స్: తెలంగాణకు చెందిన ఫార్మాస్యూటికల్స్ ఫార్ములేషన్స్ కంపెనీ సాయి పేరెంటరల్స్ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు రానుంది. ఇందుకు అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఐపీఓలో భాగంగా రూ.285 కోట్ల తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రస్తుత ఇన్వెస్టర్ల వాటాకు చెందిన 35 లక్షల వరకు ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) పద్ధతిన విక్రయించనున్నట్లు డీఆర్‌హెచ్‌పీలో కంపెనీ వెల్లడించింది.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి