రూ.250తో సిప్!
ABN , Publish Date - Jan 23 , 2025 | 06:22 AM
దేశంలో మ్యూచువల్ ఫండ్ల పరిధిని మరింత విస్తరించడంతో పాటు అల్పాదాయ వర్గాల ప్రజలు కూడా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పించేలా సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మ్యూచువల్ ఫండ్ల...
సెబీ కీలక ప్రతిపాదన
న్యూఢిల్లీ: దేశంలో మ్యూచువల్ ఫండ్ల పరిధిని మరింత విస్తరించడంతో పాటు అల్పాదాయ వర్గాల ప్రజలు కూడా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పించేలా సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మ్యూచువల్ ఫండ్ల సాచెటైజేషన్‌కు (ఉత్పత్తులు లేదా ఆర్థిక సేవలను అతి స్వల్ప ధరకు అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ) శ్రీకారం చుట్టింది. కేవలం రూ.250 క్రమానుగత పెట్టుబడి ప్రణాళిక (సిప్) ద్వారా మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేసేందుకు వీలు కల్పించాలని ప్రతిపాదించింది. డెట్, సెక్టార్ ఆధారిత, థీమాటిక్ పథకాలతో పాటు స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఈక్విటీ స్కీమ్ విభాగాలు మినహా ఏదైనా పథకంలో స్మాల్ టికెట్ సిప్‌ను ఆఫర్ చేయవచ్చని సెబీ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన చర్చా పత్రాన్ని సెబీ బుధవారం విడుదల చేసింది. తమ ప్రతిపాదనలపై వచ్చేనెల 6 నాటికి అభిప్రాయాలు, సూచనలు తెలుపాలని ప్రజలను కోరింది.
Also Read:
రాజధాని అమరావతికి మళ్లీ గుడ్ న్యూస్
సైఫ్ కేసు.. వాళ్లే చంపాలనుకున్నారా
కొంప ముంచిన పిల్లి.. ఉద్యోగం లేదు, బోనస్ లేదు..
For More Business News and Telugu News..